విమానంలో బట్టలిప్పి.. నగ్నంగా రచ్చ..
న్యూఢిల్లీ : విమానంలో న్యూసెన్స్ క్రియేట్ చేసి వార్తల్లోకి ఎక్కాడో వ్యక్తి. తన వెకిలి చేష్టలతో విమాన సిబ్బంది ఇబ్బంది పెట్టిన అతగాడిపై ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంతకీ అతగాడు వెలగబెట్టిన ఘనకార్యమేంటంటే.. తన నగ్న రూపాన్ని ఎయిర్ హోస్టెస్ ముందు నిస్సిగ్గుగా ప్రదర్శించడమే కాకుండా.. ఆమెపై ఇష్టానుసారంగా దుర్భాషలాడడం.
వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎక్కాడు. అయితే తనకు సీటు బెల్టు పెట్టుకోవడం రాదని చెప్పడంతో.. ఎయిర్ హోస్టెస్ వచ్చి అతనికి సహాయపడింది. అనంతరం టాయ్ లెట్ లోకి వెళ్లి పూర్తి నగ్నంగా మారిపోయి.. కాలింగ్ బెల్ నొక్కాడు. దీంతో అక్కడికెళ్లిన ఎయిర్ హోస్టెస్ అతడి అవతారం చూసి షాక్ తిన్నది. అభ్యంతరకర స్థితిలో అతను కనిపించడంతో కాస్త హుందాగా ప్రవర్తించాలని సదరు ప్రయాణికుడికి విజ్నప్తి చేసింది.

అయినా.. తీరు మార్చుకోని సదరు ప్రయాణికుడు విమానం దిగేటప్పుడు తన నోటికి పని చెప్పాడు. ఎయిర్ హోస్టెస్ ను దుర్భాషలాడడంతో సిబ్బంది కెప్టెన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అతగాడి ప్రవర్తనపై ఆరా తీసిన కెప్టెన్.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విమానం దిగగానే అతన్ని అదుపులోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. ప్రయాణికుల సంతృప్తే తమకు అన్నింటికన్నా ముఖ్యం అని చెప్పిన ఎయిర్ ఇండియా యాజమాన్యం.. ఇలాంటి వారి వల్ల సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతారని, అందుకే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు.












Click it and Unblock the Notifications