పెళ్ళిచేసుకొంటానని మహిళలపై లైంగిక దాడులు,డాక్టర్ పై ఇలా..

పెళ్ళి చేసుకోకుండా తిరస్కరించినందుకు మహిళ డాక్టర్ ఫోటోను సోషల్ మీడియాలో అసభ్యకరంగా అప్ లోడ్ చేసి నిందితుడిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.

బెంగుళూరు: తనను వివాహం చేసుకోనని తిరస్కరించిన డాక్టర్ పట్ట సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెట్టి వేధించిన నిందితుడిని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు.ఇదే తరహలో ఆయన పలువురు మహిళలను వేధించినట్టుగా పోలీసులు తెలిపారు.

గంగప్ప నంజేగౌడ 44 ఏళ్ళ వయస్సున్న వ్యక్తి ఓ కంపెనీలో టెక్నికల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతను మ్యాట్రిమోనియల్ సైట్లను సంప్రదిస్తుంటాడు. ఈ సైట్ల ద్వారా వితంతువులు, 35 ఏళ్ళ వయస్సున్న మహిళలను వివాహం చేసుకొనేందుకు నంజేగౌడ సంప్రతింపులు జరిపేవాడు.

2016 డిసెంబర్ 31వ, తేదిన 37 ఏళ్ళ డాక్టర్ ను నంజేగౌడ వివాహం కోసం సంప్రదించాడు.అయితే నంజేగౌడను వివాహం చేసుకొనేందుకుగాను డాక్టర్ సమ్మతించలేదు. ఈ మేరకు ఆమె తన అభిప్రాయాన్ని తెలిపింది.

man takes online revenge after woman rejects him

తనను ఎందుకు తిరస్కరించిందో తెలుసుకోవాలని డాక్టర్ పోన్ చేశాడు. అంతేకాదు ఆమె పట్ల అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆమె అతడిని దూషించింది.దీంతో ఆమెపై కోపం పెంచుకొన్నాడు నిందితుడు.

మ్యాట్రిమోనియల్ సైట్ లో ఆమె ఫోటో ను తీసివేసి ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి కాల్ గర్ల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆమెకు 500 ఫోన్లు వచ్చాయి.బాధితురాలు పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు విచారణ జరిపి నిందితుడు గురువారం నాడు అరెస్టు చేశారు.

మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా విహహం చేసుకొంటానని ప్రోఫైల్ పంపేది కేవలం లైంగిక అవసరాలు తీర్చుకొనేందుకే నని పోలీసులు చెప్పారు.వారంలో ఒకరిద్దరితో ఈ రకంగా నిందితుడు వివాహం చేసుకొంటానని లైంగిక అవసరాలు తీర్చుకొనే ప్రయత్నాలు చేసేవాడు.

నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టినట్టు పోలీసులు తెలిపారు. డాక్టర్ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు . ఈ నిందితుడి బారిన బడి పలువురు మహిళలు మోసపోయారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+