బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ను బాంబ్ పెట్టి చంపేస్తా, బెదిరించిన వ్యక్తి అరెస్ట్..
ఉన్నావ్ బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజ్నూర్ జిల్లాకు చెందిన గఫార్.. మహారాజ్‌కు ఫోన్ చేసి బాంబుతో దాడి చేసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేయడంతో యూపీ పోలీస్ యాంటీ టెర్రరీ స్క్వాడ్ పోలీసులు గఫార్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
సాక్షి మహారాజ్ బెదిరింపులకు సంబంధించి అడగగా.. నిందితుడు గఫార్ అంగీకరించాడు. తాను కువైట్‌లో ఉన్న సమయంలో సాక్షి మహారాజ్‌కు ఫోన్ చేసి బెదిరించానని ఒప్పుకున్నాడు. గఫార్‌పై 504, 507, 66 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గఫార్‌ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి.. రిమాండ్ కోసం ఇవ్వాలని కోరతామని చెప్పారు.

Recommended Video
గఫార్ నుంచి ఫోన్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే గఫార్ ఎందుకు సాక్షి మహారాజ్‌ను బెదిరించాడనే అంశంపై పోలీసులు వివరించలేదు. విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications