కోడలికి లైంగిక వేధింపులు: మామకు గుండు గీసి, చెప్పుల దండతో ఊరేగించారు
కోల్‌కతా: మేన కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తికి స్థానికులే బుద్ధి చెప్పారు. నిందితుడికి గుండు గీయించి, ఆ తర్వాత అతని మెడలో చెప్పుల దండ వేసి గ్రామమంతా ఊరేగించారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
రాణిగంజ్ ప్రాంతంలోని సత్గారంలో నివాసముంటున్న నిందితుడు(45), బొగ్గు గనిలో పని చేస్తున్నాడు. అతడు 8వ తరగతి చదువుతున్న తన మేన కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

మార్చి 1 నుంచి తన మామ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఇరుగుపొరుగు వారికి చెప్పింది. దీంతో నిందితుడ్ని పట్టుకున్న గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.
ఆ తర్వాత గుండు గీయించి.. అతని మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా తిప్పారు. అనంతరం నిందితుడ్ని రాణిగంజ్ పోలీసులకు అప్పగించారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications