పెళ్లికి పోర్న్ చిత్రాలు చూపించి వేధింపులు: భర్త అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు మహ్మద్ అలీ అలియాస్ శివకుమార్ (33) గత కొన్నేళ్లపాటు మలేషియాలో పని చేశాడు. అక్కడ పని చేస్తున్న సమయంలోనే బాధితురాలు సుమతి (23) మామను కలుసుకున్నాడు. తనకు ఎవరూ లేరని.. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అతనికి చెప్పాడు. దీంతో అతడు తన కోడలు సుమతితో నిందితుడు శివకుమార్‌కు 2009లో వివాహం చేశాడు. అనంతరం వారిద్దరూ తమిళనాడులోని లక్ష్మీపురంలో కాపురం పెట్టాడు.
ఆమెకు బలవంతంగా పోర్న్ చిత్రాలను చూపించేవాడు. అంతేగాక ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని పోలీసులు తెలిపారు. కొంతకాలం తర్వాత సుమతి అత్త అయిన సెంథమరాయి (43) వివాహాతేర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు నిందితుడు. ఆమెను వివాహం చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డాడు. సెంథమరాయితో సంబంధాన్ని తెంచుకోవాలని సుమతి నిందితుడ్ని కోరింది. దీంతో అతడు మూడు తులాల బంగారం, రూ. 2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
కాగా, నిందితుడికి ఇప్పటికే వివాహం జరిగినట్లు సుమతికి తెలిసింది. దీంతో తన జీవితానికి ప్రమాదం పొంచివుందని భావించిన సుమతి, పోలీసులను ఆశ్రయించింది. మొదటి భార్యను విడిచిపెట్టినందునే తన పేరు బయటపడకుండా శివకుమార్‌గా సుమతికి పరిచయమయ్యాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications