ఏడాది బాలుడికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన వైద్యులు...20 ఏళ్ల తర్వాత శిక్ష

చెన్నై: 20 ఏళ్ల క్రితం నాటి కేసులో చెన్నై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 20 ఏళ్ల క్రితం ఏడాది బాలుడికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు రూ.20 లక్షలు బాధితుడికి చెల్లించాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఇక వివరాల్లోకి వెళితే... 1999లో అప్పుడే పుట్టిన శిశువు విరేచనాలు వాంతులతో బాధపడుతుంటే ఆ చిన్నారిని చెన్నైలోని ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. దీన్నే ఎగ్మోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌గా కూడా పిలుస్తారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు రక్తం ఎక్కించాలని ఆ తర్వాత సర్జరీ చేయాలని చెప్పారు.. బాలుడి తల్లిదండ్రులకు ఏమి చేయాలో తెలియక ఏదైనా చేసి తన బిడ్డను కాపాడాల్సిందిగా కోరారు. ఇక రక్తం ఎక్కించారు. సర్జరీ జరిగింది. అయితే మళ్లీ కొద్ది రోజులకే ఆ బాలుడు అనారోగ్యంతో మంచం పట్టాడు.

బాలుడిని మరో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇక అక్కడ బ్లడ్ టెస్టులు చేయగా బాలుడికి హెచ్ఐవీ సోకినట్లు వైద్యులు తెలిపారు. అయితే తల్లిదండ్రులకు ఈ వ్యాధి లేకపోవడంతో బిడ్డకు ఎలా సోకిందనే ప్రశ్న మొదలైంది. వెంటనే జరిగిన విషయం చెప్పగా అసలు సంగతి వెలుగు చూసింది. అంతకుముందు హాస్పిటల్‌లో ఆ చిన్నారికి హెచ్‌ఐవీ సోకిన రక్తం ఎక్కించారని తేలింది. దీంతో ఏమి చేయాలో తెలియలేదు తల్లిదండ్రులకు . ఇక తమకు న్యాయం చేయాలని కోర్టుకు వెళ్లారు.

Man transfused with HIV positive blood as a toddler,Compensated 20 years later

కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి ఆ ప్రభుత్వ హాస్పిటల్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు గత 20 ఏళ్లుగా ఆ కుటుంబం పొందుతున్న మనో వేదన వర్ణించలేనిదని భావించింది. ఆ కుటుంబానికి రూ.20 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. అంతేకాదు ప్రస్తుతం ఆ బిడ్డకు 21 ఏళ్లు వచ్చాయి. అతనికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే అప్పుడే రూ.50,000 చెల్లించినట్లు ప్రభుత్వ హాస్పిటల్ చెప్పింది. అయితే అది అతని వైద్య ఖర్చులకు కూడా సరిపోయి ఉండవని జడ్జి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+