వీఐపీ గేట్ లో ఎయిర్ పోర్టులోకి వెళ్లాడు, విమానం కొనడానికి వచ్చాను, ఇదీ సెక్యూరిటీ !

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి చాకచక్యంగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి వెళ్లిపోయాడు.

చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి చాకచక్యంగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి వెళ్లిపోయాడు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో గేట్ నెంబర్ 5 ను వీఐపీలు ప్రవేశించడానికి ఉపయోగిస్తారు.

అంతర్జాతీయ విమానాశ్రయంలోని గేట్ నెంబర్ 5 నుంచి ఓ వక్తి సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి ప్రవేశించాడు. తరువాతర్ రన్ వే మీద తిరగడం మొదలు పెట్టాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఓ వ్యక్తి రన్‌వే మీద తిరుగుతున్న దృశ్యాన్ని చూసిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అప్రమత్తమై వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Man trespasses into Chennai Inter National Airport to buy flight

తరువాత అతన్ని సీఐఎస్ ఎఫ్ అధికారులకు అప్పగించారు. సీఐఎస్ ఎఫ్ అధికారులు అతన్ని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ చేపట్టగా అతను తమిళనాడులోని తిట్టకూడి ప్రాంతానికి చెందిన కనియన్ (34) అని వెలుగు చూసింది.

పోలీసుల విచారణలో తాను విమానం కొనడానికి ఎయిర్ పోర్టుకు వచ్చానని కనియన్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఆ తర్వాత అతని మానసిక స్థితి సరిగా లేదని తెలుసుకొన్న పోలీసులు తిట్టకూడిలోని కనియన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో ముందు జాగ్రత్తగా హై అలర్ట్‌ ప్రకటించారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత ఏ విధంగా ఉందో ఈ ఘటన ఒక ఉదాహరణ అంటూ పలువురు విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+