ఒసామా బిన్ లాడెన్‌కు ఆధార్ కార్డు తయారు చేశాడు: అరెస్ట్
న్యూఢిల్లీ: అమెరికా భద్రతాదళాలు జరిపిన దాడుల్లో హతమైన ఆల్‌ఖైదా ఉగ్ర నేత ఒసామా బిన్ లాడెన్ పేరుతో ఆధార్ కార్డును తయారు చేస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఆపరేటర్ సద్దాం మన్సూరి(35)ని అదుపులోకి తీసుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని భిల్వారా నగరంలో ని మండల్‌లో ఓ ఆధార్ రిజిస్ట్రేషన్ సెంటర్ నడుపుతున్నాడు.
కాగా, ఇతడు ఉగ్రవాది బిన్ లాడెన్ పేరు మీద ఆధార్ కార్డును తయారు చేసేందుకు ప్రయత్నించాడు. అబ్బొట్టాబాద్ జిల్లా బిల్వారా అని లాడెన్ చిరునామాను అప్‌లోడ్ చేశాడు. అంతేగాక, ఓ ఉగ్రవాది ఫొటోను స్పష్టంగా కనిపించకుండా చేసి అప్‌లోడ్ చేశాడు. కానీ, చేతి వేలిముద్ర, ఐటెంటిటీ ప్రూఫ్, ఇతర వివరాలను నమోదు చేయలేదు.

అయితే, ఈ డేటా బేస్‌ను పరిశీలించిన ధృవీకరణ శాఖ అధికారులు తప్పులు జరిగినట్లు గుర్తించి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మండల్ డీఎస్పీ చంచల్ మిశ్రా మీడియాకు తెలిపారు. ఐటీ శాఖ కూడా సద్దాం ఇలా నకిలీ ఆధార్ కార్డులు ఎలా తయారు చేశాడు?, ఎన్ని తయారు చేశాడనేదానిపై దృష్టి సారించింది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications