బస్సులోనే విద్యార్థినికి తాళి కట్టబోయాడు: చెప్పుతో..
చెన్నై: ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడమే గాక, తాళి కట్టేందుకు యత్నించిన యువకుడికి చెప్పుతో సమాధానం చెప్పి ఓ యువతి. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కళ్లనై(33) ఓ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. బస్సులో పాఠశాలకు వెళ్లే ఓ విద్యార్థినిని కళ్లనై గత కొద్ది రోజులుగా ప్రేమించాలని వేధిస్తున్నాడు.

మంగళవారం ఆ విద్యార్థిని యథావిధిగా పాఠశాలకు బస్సులో వెళుతుండగా, అదే బస్సులో ఎక్కిన కళ్లనై విద్యార్థిని మెడలో తాళి కట్టేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమై విద్యార్థిని అతడ్ని నెట్టివేసి చెప్పుతో కొట్టింది.
వెంటనే స్పందించిన బస్సులోని మిగిలిన ప్రయాణీకులు కూడా ప్రేమోన్మాదికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కళ్లనై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications