
షాకింగ్: కాబోయే భార్యతో శృంగారం-కండోమ్ మరిచిన యువకుడు-అలా చేయడంతో ప్రాణాలే పోయాయి
కాబోయే భార్యతో కలిసి లాడ్జికి వెళ్లిన ఓ వ్యక్తి... అక్కడ ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే కండోమ్ మరిచిపోవడంతో... దానికి బదులు జిగురు లాంటి పదార్థాన్ని ఉపయోగించాడు. అది తీవ్ర దుష్ప్రభావం చూపించడంతో... ఆ తర్వాత కొద్ది గంటలకే అతను మృతి చెందాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... అహ్మదాబాద్‌కి చెందిన సల్మాన్ మీర్జా అనే యువకుడు ఇటీవల తనకు కాబోయే భార్యతో కలిసి నగరంలోని ఓ హోటల్ లాడ్జికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు శృంగారంలో పాల్గొనాలని భావించారు. అయితే కండోమ్ తీసుకురావడం మరిచిపోవడంతో... దానికి బదులు (epoxy adhesive) అనే గ్లూ(జిగురు పదార్థం)ని తన మర్మాంగానికి అప్లై చేశాడు. ఆపై ఆమెతో శృంగారం జరిపాడు.

ఆ తర్వాత కొద్ది గంటలకు ఆ హోటల్ సమీపంలోని ఓ ప్రదేశంలో సల్మాన్ మీర్జా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని ఫిరోజ్ షేక్ అనే అతని స్నేహితుడు గుర్తించాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని వైద్యులు తెలిపారు. సల్మాన్ మీర్జా శరీరంలోని పలు అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను మృతి చెందాడు. అతను శృంగార సమయంలో వాడిన జిగురు పదార్థం తీవ్ర దుష్ప్రభావం చూపించిందన్నారు. నిర్దారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాలను పంపించినట్లు తెలిపారు.
Recommended Video
లాడ్జిలో శృంగారంలో పాల్గొన్న సమయంలో సల్మాన్ మీర్జా,అతని కాబోయే భార్య ఇద్దరు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మత్తు కోసం వైట్‌నర్‌తో పాటు జిగురు(Adhesive) పదార్థాన్ని వారు పీల్చి ఉంటారని... అనంతరం అదే జిగురు పదార్థాన్ని సల్మాన్ తన మర్మాంగానికి అప్లై చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. సల్మాన్‌కు వృద్దులైన తల్లిదండ్రులు,ఇద్దరు చెల్లెళ్లు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కుటుంబమంతా అతని పైనే ఆధారపడి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.