షాక్: యూట్యూబ్ లో చూసి భార్యకు కాన్ఫు చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ప్రాణం పోయింది!

చెన్నై: వైద్యుల సహాయం లేకుండా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు యూట్యూబ్ లో చూసి భార్యకు కాన్ఫు చెయ్యడానికి ప్రయత్నించాడు. భర్త చేసిన పనికి భార్య ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఘటన తమిళనాడులోని తిరుపుర ప్రాంతంలో జరిగింది.

తిరుపురలో కృతికా (28) అనే మహిళ నివాసం ఉంటున్నది. తిరుపురలోని ఓ ప్రైవేటు స్కూల్ లో కృతికా టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. కృతికా భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. కృతికా నిండుగర్భవతి.

Man watches online video to learn delivery wife dies in Tirupur in Tamil Nadu

కృతికా ఇంటిలోనే బిడ్డకు జన్మనివ్వాలని ఆమె భర్త ఆశపడ్డాడు. ఇంటిలోనే బిడ్డకు జన్మినిస్తే మనకు చాల సంతోషంగా ఉంటుందని కృతికాను ఆమె భర్త ఒప్పించాడు. భర్త ఆశ ఎందుకు కాదనాలి అంటూ కృతికా సరే అని చెప్పింది.

తన ఇద్దరు స్నేహితులను ఇంటికి తీసుకు వచ్చిన కృతికా భర్త యూట్యూబ్ లో చూసి ఆమెకు కాన్ఫు చెయ్యడానికి సిద్దం అయ్యాడు. వైద్యుల సహాయం తీసుకోకుండా కృతికాకు ఆమె భర్త కాన్ఫు చేశాడు. 3.3 కేజీల పండంటి బిడ్డకు కృతికా జన్మనిచ్చింది. అయితే కృతికా భర్త చేసిన యూట్యూబ్ వైద్యం వికటించింది.

బిడ్డ కళ్లు తెరవకముందే కృతికా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వైద్యులు సహాయం లేకుండా యూట్యూబ్ లో చూసి కాన్ఫు చెయ్యడానికి ప్రయత్నించడం వలనే కృతికా ప్రాణాలు పోయాయని ఆమె కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఇలాంటి సాహసాలు చెయ్యకూడదని, ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని వైద్యులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+