వేధింపులు, ఫిర్యాదు చేసేందుకు వెళ్లి శవమయ్యాడు
ముజఫర్ నగర్: ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని షామిలి జిల్లాలోని గ్రామంలో నివాసం ఉంటున్నబచన్ దాస్ అనే ఆయన మరణించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. బచన్ దాస్ బుధవారం ముజఫర్ నగర్ లోని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం దగ్గరకు బయలుదేరాడు. గురువారం అదే కార్యాలయం ఆవరణంలో శవమై కనిపించాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరణించిన బచన్ దాస్ చేతిలో ఉన్న ఒక కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం తన కుమార్తెను ఇద్దరు యువకులు వేధిస్తున్నారని, దయచేసి న్యాయం చేసి వారిద్దరి మీద కఠిన చర్యలు తీసుకొవాలని ఆ కాగితంలో రాశాడని పోలీసులు చెప్పారు.
వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన బచన్ దాస్ జిల్లా మెజిస్ట్రేట్ ను కలవలేకపోయానని బాధతో విషం సేవించి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముజఫర్ నగర్ పోలీసులు తెలిపారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications