Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

15 ఏళ్ళుగా పోలీసులకు చుక్కలు, వాషింగ్‌మెషిన్లో చిక్కాడిలా..

ముంబై: పోలీసులకు చిక్కకుండా 15 ఏళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడిని పోలీసులు అతి చాకచక్యంగా పట్టుకొన్నారు. పక్కా ప్లాన్‌తో దాడి చేసినా కానీ నిందితుడు ప్రతిసారీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొంటున్నాడు. అయితే తన ఇంట్లోనే వాషింగ్‌మెషిన్‌లో దాక్కొన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది

ముంబైలోని జూహు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిపై 2002లో కేసు నమోదైంది. బీఈడీ అడ్మిషన్లు ఇప్పిస్తానని చెప్పి కొందరి నుంచి సుమారు 1 లక్ష రూపాయాల దాకా వసూలు చేశాడు.బాధితుల నుండి ఫిర్యాదు అందుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.

Man who evaded arrest for 15 years caught hiding in a washing machine in Mumbai

అయితే నిందితుడి కోసం వేట ప్రారంభించారు.కానీ, నిందితుడి జాడ మాత్రం దొరకలేదు. 15 ఏళ్ళుగా పోలీసులకు నిరాశే మిగిలింది.పూణెలో కోటి రూపాయాల కుంభకోణంలో కూడ ఇతనికి పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు.

పక్కా సమాచారం మేరకు ప్రతిసారి ఆ వ్యక్తి కోసం పోలీసులు దాడులు చేస్తున్న ఫలితం లేకపోయింది.దీంతో సోమవారం నాడు కూడ నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.అయితే వాషింగ్ మెషీన్ నుండి దుస్తులను బయటఉంచడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వాషింగ్ మెషిన్ డోర్ తెరిచి చూస్తే నిందితుడు వాషింగ్ మెషిన్లో ఉన్నట్టు గుర్తించారు.నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+