Viagra-Alcohol combo:మద్యంలో వయాగ్రా,రెచ్చిపోయాడు..కానీ మొదటికే మోసం..!

మద్యంతో పాటు వయాగ్రా పిల్స్ తీసుకున్న ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

నాగ్‌పూర్: అంగస్తంభన సమస్యల వినియోగించే వయాగ్రా పిల్స్‌ను ఓ వ్యక్తి మద్యంతో పాటు తీసుకోవడంతో మృతి చెందాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. నాగపూర్‌కు చెందిన 41 ఏళ్ల వయసున్న వ్యక్తి మద్యంతో పాటు వయాగ్రా పిల్స్‌ను తీసుకున్నాడు. రెండు పిల్స్‌ను తీసుకోవడంతో మరుసటి రోజు అతని మెదడులోపల తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను న్యూఢిల్లీ ఆల్‌ ఇండియన్ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన ఆరుగురు పరిశోధకులతో కూడిన బృందం వెల్లడించింది.

హోటల్‌లో మహిళతో...

హోటల్‌లో మహిళతో...

ఇదిలా ఉంటే మృతుడిని జాగ్రత్తగా పరిశీలిస్తే అంతకుముందు అతనికి ఎలాంటి సర్జరీలు కానీ ఇతరత్రా జబ్బులు కానీ లేవని వెల్లడైంది. అయితే 41 ఏళ్లు వయసున్న ఈ వ్యక్తి మృతి చెందక ఒకరోజు ముందు తన స్నేహితురాలైన ఓ మహిళతో హోటల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అతను 50 మిల్లీగ్రాములు ఉన్న వయాగ్రా మాత్రలు రెండు తీసుకున్నాడు. ఇది మద్యంతో కలిపి తీసుకున్నాడు. సిల్‌డేనాఫిల్ అనే ఈ పిల్ అంగస్తంభనతో బాధపడేవారు తీసుకుంటారు. వయాగ్రా బ్రాండ్ పేరుతో ఈ పిల్స్‌ను విక్రయిస్తుంటారు.

మద్యంతో వయాగ్రా కలిపి...

మద్యంతో వయాగ్రా కలిపి...

మద్యంతో పాటు ఈ రెండు వయాగ్రా పిల్స్ తీసుకున్న మరుసటి రోజు ఈ వ్యక్తికి తీవ్రమైన ఆరోగ్యసమస్య తలెత్తింది. దీంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం జరిగిన పోస్ట్‌మార్టంలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యక్తి మెదడులోపల భాగంలో తీవ్రమైన రక్తస్రావం జరిగినట్లు వైద్యులు కనుగొన్నారు.మెదడులో దాదాపుగా 300గ్రాముల రక్తం గడ్డకట్టి ఉందని నిర్థారించారు.అంతేకాదు గుండెకు సంబంధించిన నాళాలు కూడా మూసుకుపోయినట్లు చెప్పిన వైద్యులు లివర్, కిడ్నాలు కూడా దెబ్బతిన్నట్లు గుర్తించారు.

మెదడులో బ్లడ్ క్లాట్

మెదడులో బ్లడ్ క్లాట్

ఇక ఈ వ్యక్తి మృతిని ఒక కేస్ స్టడీగా తీసుకున్న వైద్యులు ఒక నిర్థారణకు వచ్చారు. వయాగ్రాను మద్యంతో కలిపి సేవిస్తే మెదడుకు జరిగే రక్తప్రసరణ నిలిచిపోయి మెదడులో బ్లడ్ క్లాట్ అవుతుందని చెప్పారు. వైద్య పరిభాషలో దీన్నే సెరిబ్రోవాస్క్యులర్ యాక్సిడెంట్స్ అని పిలుస్తారు. అంతేకాదు వయాగ్రాను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే వినియోగించరాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇలాంటి వాటిపై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైన ఉందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+