Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇది నిజం: అతడు రెండు గుండెలతో జీవిస్తున్నాడు!

సాధారణంగా భూమ్మీద జీవిస్తున్న ఏ మనిషికైనా ఒకటే గుండు ఉంటుంది. కానీ, కేరళకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి మాత్రం ఇక మీదట రెండు హృదయాల స్పందనలతో జీవించనున్నాడు.

తిరువనంతపురం: సాధారణంగా భూమ్మీద జీవిస్తున్న ఏ మనిషికైనా ఒకటే గుండు ఉంటుంది. కానీ, కేరళకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి మాత్రం ఇక మీదట రెండు హృదయాల స్పందనలతో జీవించనున్నాడు.

సాధారణంగా గుండె వైఫల్యం పాలైన వారికి గుండె మార్పిడి చికిత్స చేయడం సహజమే. కానీ, ఈ కేసులో మాత్రం విఫలమైన గుండెను వైద్యులు తొలగించలేదు. మరో దాత అందించిన గుండెను అదనంగా తీసుకెళ్లి అనుసంధానించారు.

two hearts

ఇదో అరుదైన చికిత్స. ఒకే గుండెపై పూర్తి భారం పడకుండా ఇలా చేశారు. ఈ వ్యక్తిలో స్వతహాగా ఉన్న గుండె పనితీరు తగ్గిపోయి... 10 శాతం మేరే పనిచేస్తోంది. దీంతో వైద్యులు సర్జరీలో భాగంగా ఛాతీ కుడి భాగంలో గుండెను అమర్చేందుకు కొంత ఖాళీని తీసుకొచ్చారు.

ఓ మహిళా దాత నుంచి తీసుకొచ్చిన గుండెను అక్కడ ఉంచి సర్జరీ పూర్తి చేశారు. దీంతో అతడు రెండు గుండెల చప్పుడుతో జీవించనున్నాడు. ఇది ప్రపంచంలోనే అరుదైన శస్త్ర చికిత్స అని వైద్యులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+