Manager: గూగుల్ కంపెనీ మేనేజర్ ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న గర్ల్ ఫ్రెండ్, కలికాలం !

బెంగళూరు/భోపాల్: ఐఐఎంలో విద్యాభ్యాసం చేసిన యువకుడు మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకున్నాడు. గూగుల్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది. ఐటీ హబ్ బెంగళూరులోని గూగుల్ కంపెనీలో సీనియర్ మేనేజర్ హోదాలో రూ. లక్షల్లో జీతం తీసుకుంటున్నాడు. ఆఫీసు దగ్గరకు కొందరు వెళ్లి గూగుల్ మేనేజర్ తో మాట్లాడాడు. అంతే బెంగళూరులో మేనేజర్ కిడ్నాప్ అయ్యాడు. వేరే రాష్ట్రంలో ప్రత్యక్షం అయిన మేనేజర్ షాక్ అయ్యాడు. మత్తు మందు ఇచ్చి గుగూల్ మేనేజర్ ను కిడ్నాప్ చేసి ఓ యువతితో బలవంతంగా పెళ్లి చేశారు. యువతి, మేనేజర్ ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు తీశారు. జీవితాంతం ఈమెతోనే కాపురం చెయ్యాలని, లేదంటే రూ. 40 లక్షలు ఇవ్వాలని, లేదంటే సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. మామూలుగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటారని, రివర్స్ లో ఓ మగాడిని కిడ్నాప్ చేసి బలవంతంగా వేరే అమ్మాయితో పెళ్లి జరిపించారని కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

గూగుల్ లో సీనియర్ మేనేజర్

గూగుల్ లో సీనియర్ మేనేజర్


షిల్లాగ్ లోని ఐఐఎంలో విద్యాభ్యాసం చేసిన గణేష్ శంకర్ మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకున్నాడు. క్యాంపస్ లో ఉన్న సమయంలోనే గణేష్ శంకర్ కు బెంగూళరులోని గూగుల్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది. బెంగళూరులోని గూగుల్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న గణేష్ శంకర్ సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు.

బెంగళూరులో మేనేజర్ కిడ్నాప్

బెంగళూరులో మేనేజర్ కిడ్నాప్

ఐటీ హబ్ బెంగళూరులోని గూగుల్ కంపెనీలో సీనియర్ మేనేజర్ హోదాలో గణేష్ శంకర్ ప్రతినెల రూ. లక్షల్లో జీతం తీసుకుంటున్నాడు. ఆఫీసు దగ్గరకు కొందరు వెళ్లిన కొందరు యువకులు గూగుల్ మేనేజర్ గణేష్ శంకర్ తో మాట్లాడాడు. తరువాత మత్తుమందు కలిపిన ఆహారం గణేష్ శంకర్ కు ఇచ్చారు. అంతే బెంగళూరులో గూగుల్ మేనేజర్ గణేష్ శంకర్ ను కిడ్నాప్ చేశారు.

భోపాల్ లో ప్రత్యక్షం

భోపాల్ లో ప్రత్యక్షం

బెంగళూరులో గణేష్ శంకర్ ను కిడ్నాప్ చేసి మధ్యప్రదేశ్ లోని భోపాల్ సిటీలోని కమలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటికి గణేష్ శంకర్ ను తీసుకెళ్లారు. అంతే గణేష్ శంకర్ ఎదురుగా ఉన్న సుజాత అనే యువతిని చూసి షాక్ అయ్యాడు. సూజాత షిల్లాగ్ ఐఎంఎంలో గణేష్ శంకర్ తో కలిసి చదువుకునింది.

మగాడిని బలవంతంగా పెళ్లి చేసుకున్న సుజాత

మగాడిని బలవంతంగా పెళ్లి చేసుకున్న సుజాత

మత్తు మందు ఇచ్చి గుగూల్ మేనేజర్ గణేష్ శంకర్ ను కిడ్నాప్ చెయ్యడమే కాకుండా సుజాతతో బలవంతంగా అతనికి పెళ్లి చేశారు. సుజాత, గణేష్ శంకర్ ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు తీశారు. జీవితాంతం సుజాతతోనే కాపురం చెయ్యాలని, లేదంటే రూ. 40 లక్షలు ఇవ్వాలని, లేదంటే సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్టు చేస్తామని గూగుల్ మేనేజర్ గణేష్ శంకర్ ను బ్లాక్ మెయిల్ చేశారు.

మేడమ్ ఫ్యామిలీ బుక్

మేడమ్ ఫ్యామిలీ బుక్

తప్పించుకుని భోపాల్ పోలీసులను ఆశ్రయించిన గణేష్ శంకర్ సుజాతతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద కిడ్నాప్, బ్లాక్ మెయిల్, బలవంతంగా పెళ్లి చేశారని కేసు పెట్టాడు. బెంగళూరులోనే తనను కిడ్నాప్ చేసి భోపాల్ పిలుచుకుని వచ్చి కొన్ని రోజుల పాటు ఇంటిలో నిర్బంధించిన సుజాత కుటుంబ సభ్యులు నరకం చూపించారని గణేష్ శంకర్ పోలీసులకు చెప్పాడు.

ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది ?

ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది ?

సుజాత, ఆమె తండ్రి కమలేష్ సింగ్, సోదరుడు సువైక్ సింగ్, సుజాత బావ విజేంద్ర కుమార్ సింగ్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని భోపాల్ పోలీసులు అంటున్నారు. అయితే గణేష్ శంకర్ ను బెంగళూరులో ఎలా కిడ్నాప్ చేశారు, అతనికి సుజాతకు గతంలో ఉన్న సంబంధం ఏమిటి ? అని ఆరా తీస్తున్నామని భోపాల్ పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+