ఎంపీ సుమలత కొడుకు పెళ్లి ఫిక్స్, పెళ్లికి వస్తున్న ప్రధాని మోదీ ?, సీఎం, చిరంజీవి !
బెంగళూరు: బహుబాష నటి, కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎంపీ, తెలుగింటి ఆడపడుచు సుమలతా అంబరీష్ ఆమె కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం జరిపించడానికి డేట్ ఫిక్స్ చేశారు. అభిషేక్ అంబరీష్ పెళ్లి ఘనంగా నిర్వహించడానికి సుమలతా అంబరీష్ కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు.
స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్, తెలుగింటి ఆడపడుచు, ప్రముఖ నటి సుమలత ప్రేమ వివాహం చేసుకున్నారు. రెబల్ స్టార్ అంబరీష్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా, కర్ణాటక రాష్ట్ర మంత్రిగా పని చేసిన అంబరీష్ రాజకీయాల్లో కూడా ఆయన సత్తాచాటుకున్నారు.

అంబరీష్, సుమలతాకు ఏకైక కుమారుడు అభిషేక్ అంబరీష్, కన్నడ సినీ హీరో అయిన అభిషేక్ అంబరీష్ కు ఓ శుభకార్యంలో అవివా బిద్దప్ప అనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పరిచయం అయ్యింది. అవివా బిద్దప్ప తండ్రి ప్రసాద్ బిద్దప్ప కూడా చాలా ఫేమస్ ఫ్యాషన్ డిజైన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
గత లోక్ సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతా అంబరీష్ మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామిని చిత్తుచిత్తుగా ఓడించి ఎంపీ అయ్యారు. భర్త అంబరీష్ అడుగుజాడాల్లో సుమలతా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు.

గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి సుమలతా అంబరీష్ కుమారుడు అభిషేక్ అంబరీష్, ఫ్యాషన్ డిజైనర్ అవివా బిద్దప్ప ప్రేమించుకుంటున్నారు. చాలాకాలం క్రితం అభిషేక్, అంబరీష్ ల వివాహం జరిగింది. సినిమాలు, రాజకీయాల్లో బిజీగా ఉంటున్న సుమలతా ఇప్పుడు కొంచెం ఫ్రీకావడంతో పెళ్లి పనులు ఊపందుకున్నాయి.
జూన్ 5వ తేదీ, జూన్ 6వ తేదీ బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో అభిషేక్ అంబరీష్, అవివా బిద్దప్పల వివాహం గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సుమలతా అంబరీష్, అభిషేక్ అంబరీష్ పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని ప్రధాని నరేంద్ర మోదీకి మనవి చేశారు. సుమలతా అంబరీష్ కుమారుడు అభిషేక్ అంబరీష్ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుఅవుతారని తెలిసింది.

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎంలు బీఎస్. యడియూరప్ప, బసవరాజ్ బోమ్మయ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు అందరూ సుమలతా అంబరీష్ కుమారుడి పెళ్లికి హాజరు అవుతున్నారని తెలిసింది.
బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా పెళ్లి చేసిన తరువాత మండ్యలో రిసెప్షన్ ఏర్పాటు చెయ్యాలని, ఆ రోజు విందుకు సుమారు 15 వేల మంది హాజరు అవుతున్నారని సుమలత సన్నిహితులు అంటున్నారు. రెబల్ స్టార్ అంబరీష్ ఇంట్లో పెళ్లిసందడి మొదలు కావడంతో ఆ పెళ్లికి రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు, స్యాండిల్ వుడ్ నటీనటులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యే అవకాశం ఉంది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications