వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాను ఆదర్శంగా తీసుకోండి: అవినీతిపై మేనకా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆమె తోడికోడలు, దివంగత సంజయ్ గాంధీ సతీమణి, కేంద్రమంత్రి మేనకా గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. అవినీతిని అరికట్టడంలో, బంధుప్రీతికి అడ్డుకట్ట వేయడంలో సోనియా ఆదర్శప్రాయురాలని మేనకా గాంధీ అన్నారు.

తన నియోజకవర్షం పిలిభిత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మాట్లాడుతూ.. గతంలో సోనియాగాంధీ బంధువు ఒకరు ఓ షాపును ప్రారంభించి, ఆమె పేరును వాడుకుని లబ్ది పడాలని చూస్తే, దాన్ని ఆమె అడ్డుకున్నారని గుర్తు చేశారు.

Maneka Gandhi cites Sonia’s example on how to check corruption

ఆ వ్యక్తికి ఎలాంటి సాయమూ చేయవద్దని దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, ప్రతి రాజకీయ నేతా అదే విధంగా బంధుప్రీతికి దూరంగా ఉండాలని మేనకా గాంధీ కోరారు.

ఇక అవకాశం దొరికినప్పుడెల్లా సోనియాపై విమర్శలు గుప్పిస్తుండే.. మేనకాగాంధీ, ఇలా పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి చోటు చేసుకోకుండా సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

English summary
UNION MINISTER for Women and Child Development Maneka Gandhi has asked officials in her Lok Sabha constituency of Pilibhit to follow the example of Congress president Sonia Gandhi in order to check corruption in the education department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X