రాహుల్‌పై ప్రశంసలు: వరుణ్‌కు తల్లి మొట్టికాయలు

Maneka Gandhi slams son Varun for praising Rahul
అమేథీ: కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశంసించిన తన కుమారుడు వరుణ్ గాంధీకి తల్లి, బిజెపి నేత మేనకా గాంధీ మొట్టికాయలు వేశారు. ఈ మేరకు జాతీయ మీడియాలో గురువారం వార్తలు వచ్చాయి. అమేథీలో తన సోదరుడు రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమాలను వరుణ్ గాంధీ ప్రశంసించారు. ప్రటనలు చేసే విషయంలో పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని మేనకా గాంధీ సూచించారు.

వరుణ్ గాంధీ రాహుల్ గాంధీని ప్రశంసించడం తప్పు అని మేనకా గాంధీ అన్నట్లు వార్తలు వచ్చాయి. వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా మాట్లాడడం సరి కాదని ఆమె అన్నారు. తాను కొత్త రాజకీయాలను తెస్తానని, అమేథీలో రాహుల్ గాంధీ విజయవంతంగా పనిచేసినట్లుగా, అయితే లోతుగా రాహుల్ గాంధీ పనులను తాను చూడలేదని వరుణ్ గాంధీ మంగళవారం రాత్రి ఉపాధ్యాయులు, ఎన్జీవో కార్యకర్తలతో అన్నారు.

రాహుల్ గాంధీపై వరుణ్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దాంతో తాను రాహుల్ గాంధీని సమర్థించడం లేదని వరుణ్ గాంధీ వివరణ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీని గానీ, అభ్యర్థిని గానీ సమర్థించడం లేదని ఆయన చెప్పారు.

అమేథీలో తాను చేసిన పనిని ఇతర వ్యక్తులు ప్రశంసించడం తనకు ఆనందంగా ఉందని రాహుల్ గాంధీ రాయబరేలీలో బుధవారంనాడు అన్నారు. వరుణ్ గాంధీ చెప్పిన మాట వాస్తవమని ఆయన అన్నారు. తాము అమేథీలో రైతులను ఇతర ప్రపంచంతో అనుసంధానం చేస్తున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+