కలెక్టర్ మీటింగ్: సెల్ఫీలు తీస్తూ బదిలి అయ్యాడు

లక్నో: జిల్లా కలెక్టర్ తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సీనియర్ అధికారులు హాజరైనారు. పలు శాఖల అధికారులను నుంచి జిల్లా కలెక్టర్ సమాధానాలు అడుగుతున్నారు. అయితే ఆ సందర్బంలో ఓ అధికారి సెల్ఫీ తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు.

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బారాబంకి జిల్లా కలెక్టర్ యోగేశ్వర్ రామ్ మిశ్రా అధికారులతో ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు అందరూ హాజరైనారు.

Mangal Pandey as the latter was busy clicking selfies from his mobile phone

ఇదే సమావేశానికి బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి (బీడీఓ) మంగల్ పాండే అనే ఆయన హాజరైనారు. కలెక్టర్ యెగేశ్వర్ అధికారులతో సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో మంగల్ పాండే తన జోబులోని స్మార్ట్ ఫోన్ బయటకు తీశారు.

సమావేశం గురించి ఆలోచించకుండా సెల్ఫీలు తీసుకుంటూ కాలం గడిపారు. విషయం గుర్తించిన జిల్లా కలెక్టర్ యోగేశ్వర్ రామ్ మిశ్ర మండిపడ్డారు. మంగళ్ పాండేని ఆ పదవి నుంచి తప్పిస్తూ ఆ స్థానంలో సుశాంత్ సింగ్ అనే అధికారిని నియమిస్తూ సంఘటనా స్థలంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ దెబ్బతో అధికారులు షాక్ కు గురైనారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+