సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి బై బై.. గాడిదల పెంపకంతో రూ. లక్షలు సంపాదిస్తున్నాడు!
బెంగళూరు: ఏ పనీ చేయకుండా తిరిగే యువకులను గాడిదలు కాయ్ పోరా అంటూ ఊళ్లల్లోని పెద్దలు సరదాగా అంటుంటారు. కానీ, ఆ గాడిదలను పెంచుతూ ఓ యువకుడు ఏకంగా లక్షల్లో ఆదాయం సంపాదిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. అంతేగాక, గాడిదల పెంపకం కోసం ఏకంగా తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని కూడా వీడటం గమనార్హం. అయితే, ఆ ఉద్యోగంలో కంటే ఇప్పుడు ఎక్కువ సంపాదన వస్తుండటం కొసమెరుపు.

గాడిదలను పెంచుతూ పాల కేంద్రం.. లక్షల్లో ఆదాయం
ఆ వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీనివాస్ గౌడ అనే వ్యక్తి తన సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి గాడిద పాలతో వ్యాపారం చేస్తున్నాడు. పదుల సంఖ్యలో గాడిదలను పెంచుతూ వాటి పాలను విక్రయిస్తున్నాడు. అయితే, గాడిదల కష్టాన్ని చూసే తాను వాటిని చేరదీసి పెంచుకుంటున్నట్లు తెలిపాడు. అయితే, వాటి పాలను అమ్మడం ద్వారా అతడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తుండటం గమనార్హం.
గాడిదల పాల విక్రయం అనేది ప్రత్యేక వ్యాపారం
అంతేగాక, కర్ణాటక రాష్ట్రంతోపాటు కేరళలో కూడా గాడిద పాలను విక్రయిస్తున్నాడు శ్రీనివాస గౌడ.కర్ణాటకలోని మంగళూరుకు చెందని గౌడ 2020 వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేశాడు శ్రీనివాస గౌడ. ఆ తర్వాత రూ. 42 లక్షల పెట్టుబడితో 20 గాడిదలను సమకూర్చుకున్నాడు. దేశంలో ఇదొక ప్రత్యేకమైన వ్యాపారంగా ప్రారంభించాడు. కర్ణాటక రాష్ట్రంలోనే తను ఏర్పాటు చేసిన ఫారం మొదటి గాడిదల పెంపకం, పాల ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తోందని శ్రీనివాసగౌడ తెలిపాడు. గాడిదల పాలను విక్రయించాలనే తాము ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపాడు.
గాడిద పాలు 30ఎంఎల్‌కు రూ. 150
గాడిద పాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీనివాస గౌడ తెలిపాడు. గాడిద పాలు ఔషధ గుణాలతో కూడినవని, వీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని పేర్కొన్నాడు. దేశంలో గాడిద సంతతి తగ్గిపోతుండటంతో తనకు ఈ ఆలోచనను అమలు చేస్తున్నట్లు తెలిపాడు. 30 ఎంఎల్ పాల ధర రూ. 150కి విక్రయిస్తున్నట్లు గౌడ తెలిపాడు.

గౌడకు రూ. 17 లక్షల విలువైన గాడిద పాల ఆర్డర్
కాగా, మాల్స్, షాపులు, సూపర్ మార్కెట్లలోనూ ఆవు, గేదె పాల మాదిరే గాడిద పాలను విక్రయించనున్నట్లు గౌడ పేర్కొన్నాడు. ఇప్పటికే తనకు రూ. 17 లక్షల విలువ గల ఆర్డర్లు వచ్చాయని శ్రీనివాస గౌడ సంతోషంగా చెప్పుకొచ్చాడు. రానున్న కాలంలో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నట్లు తెలిపాడు. కాగా, గాడిద పాలను పలు ఔషధాలతోపాటు బ్యూటీ ఉత్పత్తుల్లోనూ వినియోగిస్తుండటంతో వీటికి చి ధర పలుకుతోంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications