నేను రా ఏజెంట్, నర్సింగ్ కాలేజ్ అమ్మాయిలు, పోలీసు అధికారులతో చిక్కీ గేమ్స్ !
బెంగళూరు/మంగళూరు: నేను రా అధికారిని అని చెప్పి అమాయకులను మోసం చేస్తున్న కేరళకు చెందిన నర్సింగ్ విద్యార్థిని కర్ణాటకలోని మంగళూరులోని ఉర్వా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన విద్యార్థి బెనెడిక్ట్ సాబు (24)గా గుర్తించామని మంగళూరు పోలీసులు తెలిపారు. సాబు కేరళలోని ఇడుక్కికి చెందినవాడని పోలీసులు అన్నారు. ఆరు నెలల క్రితం మంగళూరులోని ప్రతిష్టాత్మక యూనిటీకి చెందిన నర్సింగ్ కళాశాలలో జీఎన్ఎం కోర్సులో బెనెడిక్ట్ సాబు చేరాడు.
ఈ సమయంలో తాను కేరళ అగ్రికల్చర్ అధికారినని బెనెడిక్ట్ సాబు కళాశాల ప్రిన్సిపాల్‌తో చెప్పాడు. దాని ప్రకారం బెనెడిక్ట్ సాబు ఫేక్ ఐడీ తయారు చేశాడు. ఆ తర్వాత సాబు తాను కేరళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు ఇతరులకు చెప్పుకుంటూ తిరిగేశాడు. ప్రస్తుతం రా ఫీల్డ్ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తూ అండర్‌కవర్ ఆపరేషన్‌లో ఉన్న బెనెడిక్ట్ సాబు అమాయకులను నమ్మిస్తూ తిరుగుతున్నాడు.

ఆదివారం బెనెడిక్ట్ సాబును అదుపులోకి తీసుకున్న మంగళూరు పోలీసులు అతన్ని లోతుగా విచారించగా అసలు విషయం బయటకు చెప్పాడని పోలీసు అధికారులు తెలిపారు. బెనెడిక్ట్ సాబు నుంచి నకిలీ ఐడీ కార్డులు, పోలీసు యూనిఫామ్ తో సహా కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పొలీసు అధికారులు తెలిపారు. బెనెడిక్ట్ సాబు నుండి మొబైల్ లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుని అతని మీద చీటింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications