5ఎకరాల మామిడి తోట: సచిన్, ఐశ్వర్య, మోడీల పేర్లు, నెక్స్ట్ కేజ్రీ
లక్నో: పలు మామిడిపండ్ల రకాలను సృష్టించి, వాటికి ప్రముఖుల పేర్లను పెట్టే ప్రముఖ ఉద్యానవవేత్త హాజీ కలీముల్లా ఖాన్.. కొత్త హైబ్రిడ్ మామిడికి నమో ఆమ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరును ఇటీవల పెట్టారు. ప్రపంచ ప్రముఖుల నేతల జాబితాలో చేరిన మోడీలాగానే ఈ మామిడి పండు సైతం వెలుగులోకి రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానిగా ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగుదేశాల నేతలను ఆహ్వానించడం ద్వారా మోడీ స్నేహహస్తాన్ని చాచారని, పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం ప్రపంచంలోనే సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని కొత్త మామిడికి నమో ఆమ్ పేరు పెట్టినట్లు చెప్పారు.
హాజీ కలీముల్లా ఖాన్ గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరు, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ తదితరుల పేర్లు పెట్టారు. వీరు పేర్లు పెట్టడానికి గల కారణాన్ని ఆయన చెబుతూ... తన మామిడి పండ్లు సదరు లెజెండ్స్‌ను శాశ్వత కీర్తిని కలిగించేందుకేనని చెప్పారు.

కాగా, హాజీ కలీముల్లా ఖాన్ పండ్ల తోట ఐదు ఎకరాల మేర విస్తరించి ఉంది. ఇది మలిహాబాదులో ఉంది. ఇందులో వివిధ రకాల మామిడి పండ్లను, కొత్త రకం మామిడి పంట్లను సాగు చేస్తారు. ఈ పండ్ల తోట వంద సంవత్సరాల క్రితంది అని తెలుస్తోంది.
దీనిని 1987 నుండి ఇందులో వివిధ రకాల పండ్లు సాగు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు మూడు వందల రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇందులో వివిధ రకాల వెరైటీస్, ఆకారాలు, పరిమాణం కలిగిన పండ్లను సాగు చేస్తుంటారు. ఇతనికి పద్మశ్రీ కూడా వచ్చింది. తన తదుపరి మామిడి పండుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు పెడతానని చెప్పారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications