మోడీపై నీచ్ ఆద్మీ వ్యాఖ్యలు: రాహుల్ ట్వీట్, దిగొచ్చిన అయ్యర్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు నేత మణిశంకర్ అయ్యర్ కొత్త వివాదానికి పురుడు పోశారు. ప్రధాని నరేంద్ర మోడీపై మర్యాదరహితమైన పదప్రయోగం చేసి వివాదంలో చిక్కుకున్నారు.

మోడీపై మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు: లైవ్ షోలో ఏడ్చేసిన జివిఎల్

మోడీని నీచ్ ఆద్మీ అని ఆయన అభివర్ణించడం వివాదానికి దారి తీసింది. "మఝకో లగ్తా హై కి యె ఆద్మీ బహుత్ నీచ కిసమ్ కా ఆద్మీ హై, ఇస్మే కోయి సభ్యత నహీ హై. ఆర్ ఐసే మౌకే పర్ ఇస్ కి గాండీ రాజ్‌నీతి కర్నే కి క్యా ఆవశ్యకతా హై?" అని మణిశంకర్ అయ్యర్ అన్నట్లు వార్తలు వచ్చాయి.

 మోడీ ఇలా స్పందించారు...

మోడీ ఇలా స్పందించారు...

"వారు నన్ను నీచ్ (అధమ) అని పిలువవచ్చు. కానీ పని చాలా ఊంచ్ (ఉన్నతం)" అని ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల ప్రచార సభలో అన్నారు. గుజతార్ సమాధానం చెప్తుందని ఆయన అన్నారు. తాను సమాజంలోని పేదవర్గం నుంచే వచ్చానని అంటూ తాను పేదలు, దళితులు, గిరిజనులు, ఓబిసీల కోసమే ప్రతి క్షణం పనిచేస్తానని, వారేం మాట్లాడుతారో మాట్టాడనీయండి, మన పని పని చేసుకుపోదామని ఆయన అన్నారు.

 ఇంకా ఇలా అన్నారు..

ఇంకా ఇలా అన్నారు..

ప్రధాని నరేంద్ర మోడీ ఆ వ్యాఖ్యలతో సరిపుచ్చకుండా మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై కాంగ్రెసు విలువలకు నిదర్శనంగా నిలుస్తుందని, అది కులాలను తక్కువ చేసి చూస్తుందని, ఉన్నత, దిగువ కులాలంటూ మాట్లాడుతుందని ఆయన అన్నారు.

అయ్యర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ

అయ్యర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ

అయ్యర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. అయ్యర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బీజేపీ, ప్రధాని తప్పుడు మాటలు ఉపయోగిస్తూ కాంగ్రెస్‌ను నిత్యం విమర్శిస్తుంటారని, అది వారి సంస్కారంమని, కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యేక సంస్కారం, వారసత్వం ఉందని అన్నారు. మణిశంకర్‌ అయ్యర్‌ ప్రధాని మోడీని సంబోధించిన తీరును తాను సమర్థించబోనని, కాంగ్రెస్‌ పార్టీ, తాను కూడా వెంటనే మోడీకి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నామని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

 దిగివచ్చిన అయ్యర్

దిగివచ్చిన అయ్యర్

రాహుల్ గాంధీ సూచన మేరకు మణిశంకర్‌ వెంటనే మోడీకి క్షమాపణలు చెప్పారు. తనకు హిందీ సరిగా రాదని, అందుకే తప్పులు దొర్లాయని అంటూ అందుకు మన్నించాలని కోరారు. హిందీ తన మాతృభాష కాదని, తన మాటలకు వేరే అర్థం వస్తే తాను క్షమాపణ చెబుతున్నానని ఆయన అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mani Shankar Aiyar, who has called PM Narendra Modi a "neech aadmi" in a new attack, earned a swift reply from the Prime Minister.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి