హీరోయిన్‌పై లైంగిక దాడి: స్కెచ్ వేసింది అతనే...

మలయాళీ హీరోయిన్‌పై దాడికి స్కెచ్ వేసింది అతనేనని, కారులోకి ప్రవేశించే వరకు తనకు ఆ విషయం తెలియదని నిందితుల్లో ఒక్కడైన మణికందన్ అంటున్నాడు.

కొచ్చి: ప్రముఖ మలయాళీ నటిపై దాడికి పథక రచన చేసింది సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ అని నిందితుల్లో ఒక్కడైన మణికందన్ అంటున్నాడు. ఈ దాడి కేసుకు సంబంధించి అతను పలు కీలక విషయాలు దర్యాప్తు అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.

సునీ పథకం ప్రకారమే నటి కిడ్నాప్, ఆమెపై లైంగిక వేధింపుల ఘటన జరిగినట్లు అతను చెప్పాడు. పల్సర్ సునీ ఇంకా పరారీలోనే ఉన్నాడు. బాధితురాలి మాజీ డ్రైవర్ అయిన అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్ారు. నేరంలో పల్సర్ సునీకి సహకరించిన మణికందన్ సోమవారం రాత్రి పాలక్కడ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

తాను కారులోకి ప్రవేశించి దాడి చేసే వరకు పల్సర్ సునీ గురించి తమకు తెలియదని అతను చెప్పాడు. ఓ పని ఉందంటూ పల్సర్ సునీ కాల్ చేసి పిలిచాడని, ఎవరినో కొట్టేందుకు అతను పిలిచిఉంటాడని తాను భావించానని, కానీ నటి మీద దాడికి తమను పిలిచాడని తర్వాత తెలిసిందని అతను చెప్పాడు.

Manikandan statement: plan for attack on actress was of Suni

నటి కారులోకి తాము వెళ్లిన తర్వాత తాను మాత్రం దాడి చేయలేదని మణికందన్ చెప్పినట్లు సమాచారం. నటిపై దాడి తర్వాత డబ్బుల కోసం దాడిలో పాల్గొన్న ఇతరు వ్యక్తులు సునీతో గొడవ పడ్డారని, వారికి రూ.30 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పి అతను తప్పించుకున్నాడని మణికందన్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

అయితే, మణికందన్ చెప్పిన విషయాలను పూర్తిగా దర్యాప్తు అధికారులు విశ్వసించడం లేదని తెలుస్తోంది. అతన్ని మరింతగా విచారించిన తర్వాతనే ఏం జరిగిందనే విషయంపై స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి నటి వాహనాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+