కాంగ్రెస్ పార్టీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గోవా, మణిపూర్‌లలో చిన్నపార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి.
ఇంఫాల్: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గోవా, మణిపూర్‌లలో చిన్నపార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి.
ఇటీవలో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే చేరిన విషయం తెలిసిందే. తాజాగా మణిపూర్‌లోనూ అదే జరిగింది. మణిపూర్ ఎమ్మెల్యే జిన్సునౌ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో జిన్సునౌ కాషాయ కండువా కప్పుకున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఆధ్వర్యంలో ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సింగత్ నియోజకవర్గం నుంచి జిన్సునౌ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.












Click it and Unblock the Notifications