హెల్మెట్ ధరించని వాహనదారులకు స్వీట్లు పంపిణీ: ఎక్కడో తెలుసా?
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రానికి చెందిన పోలీసులు వాహనదారుల పట్ల సరికొత్త రీతిలో వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు భారీ జరిమానాలు వేయకుండా స్వీట్లు పంపిణీ చేస్తున్నారు. ఇలా స్వీట్లు పంపిణీ చేస్తూనే వాహనదారులకు సేఫ్టీపై సూచనలు చేస్తున్నారు చురచంద్‌పూర్ ట్రాఫిక్ పోలీసులు.

సేఫ్టీ డ్రైవ్ పేరుతో..
ఈ సేఫ్టీ డ్రైవ్ ప్రచారానికి ఎస్పీ అమృత సిన్హా నేతృత్వం వహిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేస్తే కలిగే నష్టాల గురించి వారికి వివరిస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసే ద్విచక్ర వాహనదారుల కోసమే ఈ సేఫ్టీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అమృత ఏఎన్ఐకి తెలిపారు. కొందరు హెల్మెట్ ఇంటి దగ్గరే పెట్టి మర్చిపోతున్నారని, మరికొందరు వాహనంలోనే పెట్టుకుని తలకు పెట్టుకోవడం లేదని ఆమె చెప్పారు.

వాహనదారులను ఆపి స్వీట్లు..
హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపేవారిని ఆపి.. వారికి స్వీట్లు ఇచ్చి, సేఫ్టీ సూచనలు చేస్తున్నామని ఎస్పీ అమృత తెలిపారు. గత కొన్ని రోజులుగా చుచంద్‌పూర్ పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ డ్రైవ్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

మార్పు కోసమే..
జరిమానాలు వాహనదారుల్లో మార్పు తీసుకురావడం లేదని, అందుకే ఇలాంటి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎస్పీ అమృత చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వాహనదారులు ప్రమాదానికి గురైనప్పటికీ స్వల్ప గాయాలతోనే బయటపడవచ్చునని, లేదంటే ప్రాణాలే పోయే అవకాశం ఉంటుందని అన్నారు.

ప్రజల నుంచి మంచి స్పందన
కాగా, పోలీసులు చేస్తున్న ఈ పనిపై స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది. పోలీసులు ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వాహనదారుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. స్వీట్లు తీసుకోవడం వల్ల తనకు హెల్మెట్ విషయం ఎప్పుడూ గుర్తుంటోందని పాయా సౌంతక్ అనే వ్యక్తి తెలిపారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications