మణిపూర్ బూటకపు ఎన్‌కౌంటర్ల కేసు: సిబిఐని తప్పుపట్టిన సుప్రీం

న్యూఢిల్లీ: మణిపూర్ బూటకపు ఎన్‌కౌంటర్ల కేసులో సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని తప్పు పట్టింది. కేసులో ఎఫ్ఐఆర్‌లను ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. మణిపూర్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ తౌనోజామ్ హీరోజిత్ సింగ్ వాంగ్మూలంతో బూటకపు ఎన్‌కౌంటర్ల విషయం వెలుగులోకి వచ్చంది.

సుప్రీంకోర్టు ప్రధానంగా 42 బూటకపు ఎన్‌కౌంటర్ల కేసులను ప్రస్తావించింది. అవి 2003, 2009 మధ్య కాలంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అయిన హీరోజిత్ 2003, 2009 మధ్య కాలంలో జరిగిన పలు బూటకపు ఎన్‌కౌంటర్లను చూసినట్లు చెప్పాడు.

Manipur fake encounters case: SC pulls up CBI for not registering FIR

ఈ కేసుల్లో ఈ ఏడాది జనవరి 31వ తేదీన లేదా దానికి ముందు మరో 30 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయాలని సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ను ఆదేశించింది. ఇప్పటి వరకు తాము 12 ఎఫ్ఐఆర్‌లను మాత్రమే నమోదు చేశామని చెప్పడంతో సుప్రీంకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.

దర్యాప్తులో ప్రగతిని సమీక్షించాలని సిడిఐ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ, జస్టిస్ ఎ మదన్ ి లోకూరు, జస్టిస్ యుయు లలిత్ తదపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేశారు.

హీరోజిత్ 2016లో సస్పెండైన తర్వాత హీరోజిత్ - సీనియర్ అధికారి ఆదేశాల మేరకు తాను బిటీ రోడ్డులోని ఫార్మసీలోపల చుంగ్‌ఖమ్ సంజిత్‌ను చంపానని ప్రకటించి సంచలనం సృష్టించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+