ఎట్టకేలకు తీహార్ జైలు నుంచి విడుదలైన మనీశ్ సిసోడియా
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు కొన్ని షరతులు విధించింది. సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది.
రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో సిసోడియాను విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఢిల్లీ మనీశ్ సిసోదియా శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా గత 17 నెలలుగా జైలులో ఉన్నారని, ఇంకా ఆయనపై విచారణ ప్రారంభం కాలేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో బెయిల్ కోరిన మనీశ్‌ను ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొంది. 'బెయిల్ అనేది నియమం- జైలు మినహాయింపు' అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
AAP leader and former Delhi Deputy CM Manish Sisodia meets the family of CM Arvind Kejriwal at their residence.
— ANI (@ANI) August 9, 2024
Manish Sisodia walked out of Tihar Jail this evening after being granted bail by Supreme Court in Delhi Excise Policy case.
(Pics: AAP) pic.twitter.com/fBFeHVDO86
కాగా, మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సత్యాన్ని దక్కిన విజయంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది. జైలులో ఉన్న పార్టీకి చెందిన ఇతర నేతలకు కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 'ఢిల్లీ విద్యా విప్లవ వీరుడు మనీశ్ కు బెయిల్ లభించడం వల్ల ఈ రోజు దేశమంతా సంతోషంగా ఉంది. గత 530 రోజులుగా సిసోడియాను జైల్లో ఉంచారు. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడమే మనీశ్ చేసిన నేరమా?' అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రంపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా ధ్వజమెత్తారు.
VIDEO | AAP leader Manish Sisodia (@msisodia) greets party workers and supporters with 'Bharat Mata Ki Jai' and 'Inquilab Zindabad' slogans, after walking out of Tihar Jail.
— Press Trust of India (@PTI_News) August 9, 2024
"Greeting to everyone, to my family that has come here, to my sisters who have been waiting for the… pic.twitter.com/SmC2wzBONe
మరోవైపు, మనీశ్ కు బెయిల్ రావడాన్ని ఢిల్లీ మంత్రి అతీశీ స్వాగతించారు. 'ఈరోజు నిజం గెలిచింది. ఢిల్లీ విద్యార్థులు గెలిచారు. పేద పిల్లలకు మంచి చదువు అందించినందకే మనీశ్‌ను జైల్లో పెట్టారు' అని కేంద్రంపై అతీశీ మండిపడ్డారు. ఈ సందర్బంగా కొంత భావోద్వేగానికి గురై కన్నీరుపెట్టుకున్నారు. కాగా, సిసోడియా జైలు నుంచి విడుదలవడంతో ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజ్యాంగమే తనను రక్షించిందంటూ సిసోడియా జైలు నుంచి విడుదలైన సందర్భంగా వ్యాఖ్యానించారు. జైలు నుంచి విడుదలైన సిసోడియా.. నేరుగా సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. కేజ్రీవాల్ కుటుంబసభ్యులను కలిశారు. దీంతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications