మోడీపై మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు: లైవ్ షోలో ఏడ్చేసిన జివిఎల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై ఓ టీవీ లైవ్ షోలో కాంగ్రెసు నేత మణిశంకర్ అయ్యర్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. మోడీని మణిశంకర్ అయ్యర్ నీచ్ ఆద్మీగా అభివర్ణించారు.
Recommended Video

రాహుల్ సూచన మేరకు మణిశంకర్ అయ్యర్ క్షమాపణలు చెప్పినప్పటికీ బిజెపి నేతల ఎదురు దాడి తగ్గలేదు. ఆ వ్యాఖ్యలపై గుజరాత్ ప్రచారంలో ఉన్న మోడీ కూడా స్పందించారు. లైవ్ షోలో బిజెపి నేత జివిఎల్ ఏమీ మాట్లాడకుండా కంటనీరు పెట్టారు.

లైవ్ షోలో ఏడ్చేసిన జివిఎల్
ఎబిపి న్యూస్ చానెల్ ప్రత్యక్ష ప్రసారంలో మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి కూడా ఇష్టపడక బిజెపి నేత జీవిఎల్ నరసింహారావు నిరుత్తరుడయ్యారు. నేను వ్యతిరేకిస్తున్నానంటూ ఓ కాగితం మీద రాసిచ్చి మాట్లాడడానికి నిరాకరించారు.

జివిఎల్ ఏడ్వడం ప్రారంభించాడు
మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలకు తీవ్ర మనస్తాపానికి గురైన జివిఎల్ టీవీ లైవ్ షోలోనే ఏడ్చేశాడు. కన్నీటిని దిగమింగకుంటూ చాలా సేపు కళ్లు మూసుకుని చాలా సేపు షోలో మౌనంగా ఉండిపోయారు. దేశ ప్రధానిపై ఆ విధమైన పదప్రయోగం చేయడం తాను చాలా వ్యథ చెందుతున్నట్లు తెలిపారు.

అయ్యర్ అప్పుడు కూడా...
మణిశంకర్ అయ్యర్‌కు వివాదాలేమీ కొత్త కాదు. 2014 లోకసభ ఎన్నికలకు ముందు మోడీని చాయ్‌వాలాగా అభివర్ణించి చిక్కుల్లో పడ్డారు. మోడీ 21వ శతాబ్దంలో ప్రధాని కాలేరని నేను కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలనని, మోడీ చాయ్ అమ్మాలనుకుంటే తాను అందుకు స్థలం చూపిస్తానని ఆయన అన్నారు.

తోటి కాంగ్రెసు నేతను కూడా వదల్లేదు
మణిశంకర్ అయ్యర్ తోటి కాంగ్రెసు నేతను కూడా వదిలిపెట్టలేదు. అజయ్ మాకెన్‌పై 2013 సెప్టెంబర్‌లో ఓ ఇంటర్వ్యూలో హన్స్‌రాజ్ కాలేజీ నుంచి పాసయ్యాడని, అతను డైకోటమస్ వంటి పెద్ద పదాలు ఎలా వాడుతాడో ఆశ్చర్యం వేస్తుందని అప్పటి క్రీడా శాఖ మంత్రి అజయ్ మాకెన్‌పై వ్యాఖ్యానించారు.

ఇలా హఫీజ్ సాహెబ్
ముంబై దాడుల సూత్రధారి , అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను సాహెబ్ అనడం ద్వారా మణిశంకర్ అయ్యర్ చిక్కుల్లో పడ్డారు. హఫీజ్ సాహెబ్ మైనారిటీ గ్రూప్‌నకు చెందినవాడని, పాకిస్తానీ మెజారిటీ భారత్‌తో శాంతి కోరుకుంటోందని అన్నారు. హఫీజ్ సాహెబ్ మాదిరిగానే మనకు కూడా కొంతమంది హఫీజ్‌లున్నారని, వారు ప్రగతిని కోరుకోరని, సాధారణ మానవులు ఉత్తమ సంబంధాలను కోరుకుంటున్నారని, అతన్ని అరెస్టు చేసి, ఉగ్రవాద కోర్టుకు పంపించాలని మనం అనుకుంటున్నామని ఆయన అన్నారు.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications