మాజీ భర్త దిలీప్‌ను అరెస్టు చేశారని తెలిసి స్పృహ తప్పి పడిపోయిన మంజు వారియర్ !
ప్రముఖ మలయాళం హీరో దిలీప్ ను పోలీసులు అరెస్టు చేశారని సమాచారం తెలుసుకున్న ఆయన మాజీ భార్య, నటి మంజు వారియర్ స్పృహ తప్పి పడిపోయారని మలయాళం మీడియా వార్తలు ప్రసారం చేసింది.
కొచ్చి: ప్రముఖ మలయాళం హీరో దిలీప్ ను పోలీసులు అరెస్టు చేశారని సమాచారం తెలుసుకున్న ఆయన మాజీ భార్య, నటి మంజు వారియర్ స్పృహ తప్పి పడిపోయారని మలయాళం మీడియా వార్తలు ప్రసారం చేసింది. మంజు వారియర్ కు వైద్యులు చికిత్స చేశారని ఆమె సన్నిహితులు చెప్పారని సమాచారం.
మలయాళం హీరో దిలీప్ ను వివాహం చేసుకున్న మంజు వారియర్ ఆయనతో 16 ఏళ్లు కాపురం చేసిన తరువాత 2016లో విడాకులు తీసుకున్నారు. మంజు వారియర్ తో విడాకులు తీసుకున్న దిలీప్ తరువాత మరో నటి కావ్య మాధవన్ ను వివాహం చేసుకున్నాడు.

దిలీప్ తో విడాకులు తీసుకున్న మంజు వారియర్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంజు వారియర్ స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారని ఆమె సన్నిహితులు అంటున్నారు.
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో తప్పు చేసిన వారిని ఎవ్వరినీ విడిచి పెట్టరాదని ఇటీవల మంజు వారియర్ డిమాండ్ చేసిన విషయం తెలిసింది. కిడ్నాప్, లైంగిక దాడికి గురైన నటికి మంజు వారియర్ స్నేహితురాలు. తన మాజీ భర్త దిలీప్ ఇలాంటి పని చేస్తాడని మంజు వారియర్ ఊహించలేక షాక్ గురై స్పృహ తప్పి పడిపోయారని ఆమె సన్నిహితులు అంటున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications