నటి లైంగిక దాడి: దిలీప్ కు నటి మంజు వారియర్ ఫస్ట్ వైఫ్ కాదు, ఎంత మంది భార్యలు, ఆమె ?
ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైన మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ రహస్య విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైన మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ రహస్య విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దిలీప్ మొదట పెళ్లి చేసుకున్నది ప్రముఖ నటి మంజు వారియర్ కాదని తెలిసింది.
కేరళ పోలీసుల విచారణలో హీరో దిలీప్ కు సంబంధించిన పెద్ద రహస్యం బయటపడింది. మలాయళం సినీరంగంలో దిలీప్ పలు సినిమాలు సక్సస్ సాధించిన తరువాత అప్పట్లో ప్రముఖ నటి మంజు వారియర్ ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

నిప్పులు పోసిన కావ్య మాధవన్
దిలీప్, మంజు వారియర్ కు ఒక పాపకూడా పుట్టింది. దిలీప్, మంజువారియర్ సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో ప్రముఖ నటి కావ్య మాధవన్ ఎంట్రీ ఇచ్చి వారి సంసారంలో నిప్పులు పోశారు. అప్పటి నుంచి దిలీప్, మంజు వారియర్ సంసారంలో గొడవలు మొదలైనాయి.

తుఫానులా గొడవలు
తుఫానులాగా మారిపోయిన వారి గొడవ చివరికి కోర్టు మెట్టులెక్కింది. 2015లో దిలీప్, మంజు వారియర్ విడాకులు తీసుకున్నారు. తరువాత దిలీప్ మలయాళం ప్రముఖ నటి కావ్య మాధవన్ ను వివాహం చేసుకున్నాడు. తన సంసారంలో గొడవలు జరగడానికి ప్రముఖ నటి కారణం అని తెలుసుకున్న దిలీప్ రగిలిపోయాడు.

హీరోలో విలనిజం !
దిలీప్ తనలోని విలనిజం బయటకు తీసి 2017 ఫిబ్రవరి 17వ తేదీన ప్రముఖ నటిని కిడ్నాప్ చేయించి సామూహిక లైంగిక దాడి చేయించాడని వెలుగు చూడటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ ను పోలీసులు విచారణ చేశారు.

మొదటి భార్య నేను కాదు !
మంజు వారియర్ చెప్పిన అసలు విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. దిలీప్ కు తాను మొదటి భార్య కాదని మంజు వారియర్ స్టేట్ మెంట్ ఇచ్చారని ఓ పోలీసు అధికారి అంటున్నారు. సినిమా రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా దిలీప్ పని చేసిన విషయం తెలిసింది.

సమీప బంధువుతో పెళ్లి
మాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ కొనసాగిస్తున్న సమయంలో దిలీప్ కు వారి కుటుంబ సభ్యులు దగ్గరి బందువు అయిన ఓ అమ్మాయితో వివాహం జరిపించారు. తరువాత మాలీవుడ్ లో దిలీప్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం, అంచలంచలుగా పైకి రావడం జరిగిపోయింది.

మొదటి భార్య చేదు అయ్యింది
సినిమా రంగంలో హీరోగా నిలబడిన తరువాత దిలీప్ మంజు వారియర్ ను ప్రేమించాడు. మొదటి భార్య చేదు కావడంతో ఆమెకు ఇంతో అంతో నగదు ఇచ్చి అడ్డు తొలగించుకున్నాడు. తరువాత మంజు వారియర్ ను వివాహం చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

దుబాయ్ లో మొదటి భార్య
దిలీప్ మొదటి భార్య పూర్తి వివరాలను కేరళ పోలీసులు సేకరిస్తున్నారు. దిలీప్ మొదటి భార్య ప్రస్తుతం దుబాయ్ లో నివాసం ఉంటున్నదని కేరళ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దిలీప్ ఎలాంటి వాడు ? అని ఆమె నుంచి పూర్తి వివరాలు సేకరించాలని కేరళ పోలీసులు సిద్దం అయ్యారు.

మంజు వారియర్, కావ్య మాధవన్
నటి సామూహిక లైంగిక దాడి కేసులో దిలీప్ అరెస్టు అయిన తరువాత ఆయన మాజీ భార్య మంజు వారియర్, రెండో భార్య కావ్య మాధవన్ ను విచారణ చేసిన పోలీసులు ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అని ఆరా తీశారు. అయితే దుబాయ్ లో ఉన్న దిలీప్ మొదటి భార్యను విచారణ చేస్తే మరింత కీలకమైన సమాచారం వెలుగు చూస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

16 ఏళ్ల తరువాత ఆమె వస్తారా ?
దిలీప్ మొదటి భార్యను కేరళ రప్పించాలని పోలీసులు నిర్ణయించారని తెలిసింది. అయితే ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం విడిపోయి దుబాయ్ లో కాలం గడుపుతున్న ఆమె కేరళ వస్తారా ? లేదా ? అనే విషయం వేచి చూడాలి. మొత్తం మీద దిలీప్ అరెస్టు అయిన తరువాత ఆయనకు సంబంధించిన ఏదో ఓ కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications