బొగ్గు కుంభకోణంలో సమన్లు జారీ: చింతిస్తున్నానన్న మన్మోహన్

న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం కేసుకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. బొగ్గు కుంభకోణం కేసులో హాజరు కావాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపుకు సంబంధించి మన్మోహన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆయన పర్యవేక్షణలోనే ఉంది. ఈ కేసులో వివిధ కోణాలపై అప్పటి బొగ్గు శాఖా మంత్రి (మన్మోహన్‌సింగ్)ను విచారించకుండా.. కేసులో తుది నివేదికను అంగీకరించబోమని ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌ పరాశర్ పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మన్మోహన్ సింగ్‌కు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ తోపాటు పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, మరో ముగ్గురికి కూడా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

Manmohan Singh summoned as accused in coal scam case

చింతిస్తున్నా: మన్మోహన్

బొగ్గు కుంభకోణం కేసులో బుధవారం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేయడం పట్ల చింతిస్తున్నట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ కేసులో తొలిసారి మాట్లాడిన ఆయన, ఇది కేవలం జీవితంలో భాగమేనని అన్నారు. ఈ విషయంలో తాను చట్టపరమైన పరిశీలనకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

యూపిఏ-2 హయాంలో రెండవసారి ప్రధాని అయిన మన్మోహన్ అప్పట్లో బొగ్గు శాఖను ఆయనే పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో హిందాల్కో సంస్థకు బొగ్గు క్షేత్రాల కేటాయింపులు సిఫారసులతో జరిగినట్లు బయటపడటంతో మన్మోహన్ సింగ్‌కు సమన్లు జారీ చేయడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+