రక్షణ మంత్రి పారికర్ రాజీనామా: గోవా ముఖ్యమంత్రిగా.. ఎల్లుండి ప్రమాణం

కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. ఆయన గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

న్యూఢిల్లీ/పనాజీ: కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. ఆయన గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పారికర్ సీఎం అయితే తాము మద్దతిచ్చేందుకు సిద్ధమని ఇతరులు చెప్పారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పారికర్ కావాలని తీర్మానం చేశారు.

ఈ నేపథ్యంలో పారికర్ రాజీనామా చేశారు. దీంతో మరోసారి గోవా పీఠంపై ఆయన కూర్చోబోతున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయడంతోనే సీఎం పీఠం కోసమని అందరికీ అర్థమైంది.

బీజేపీకి ఎంజీపీ, జీఎఫ్‌పీలు మద్దతు పలుకుతున్నాయి. 40 స్థానాలు గల గోవాలో కాంగ్రెస్‌కు 17, బీజేపీకి 13 స్థానాలు వచ్చాయి. ఎంజీపీ 3, ఇతరులు 7 స్థానాల్లో గెలిచారు.

manohar parrikar

ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు

గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. 13 స్థానాల్లో గెలిచినప్పటికీ ఎంజీపీ, జీఎఫ్‌పీ, ఇతరుల మద్దతుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ఎంజీపీకి మూడు, జీఎఫ్‌పీకి రెండు మంత్రు పదవులు ఇవ్వనున్నారు. బీజేపీకి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, నాలుగు మంత్రి పదవులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+