ఐదునెలల గ్యాప్ తర్వాత సెక్రటేరియట్‌కు సీఎం
పనాజీ: అనారోగ్యకారణంగా ఐదునెలల పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంటున్న గోవా సీఎం మనోహర్ పారికర్ ఎట్టకేలకు కొత్త ఏడాదిన తన కార్యాలయంను సందర్శించారు. పనాజీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఆయన సడెన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 11 నెలల క్రితం పేగుసంబంధిత వ్యాధితో బాధపడుతున్నప్పటి నుంచి ఆయన సచివాలయానికి రావడం మానేశారు. గతేడాది ఆగష్టులో చివరిసారిగా మనోహర్ పారికర్ తన కార్యాలయంలో కనిపించారు.
ఐదు నెలల గ్యాప్ తర్వాత కార్యాలయానికి మనోహర్ పారికర్ చేరుకోవడంతో అతని సహచర మంత్రులు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా పలువురి మంత్రులతో పారికర్ సమావేశం అవడంతో పాటు సెక్రటేరియట్ సిబ్బందితో కూడా మాట కలిపారు.ఇదిలా ఉంటే పారికర్ కాస్త కోలుకున్నప్పటికీ ఆయనకు ఎవరో ఒకరు సహాయం చేయాల్సిందే. ఒకరి సహాయం లేకుండా ఆయన సొంతంగా పనులు చేసుకునేలా కనిపించడం లేదు.అంతేకాదు ఫీడ్ ట్యూబ్‌తోనే పారికర్ కనిపించారు.

ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనెన్స్‌లో చికిత్స పొందిన పారికర్ అక్టోబర్ 15న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తన సొంత నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత మండోవి నదిపై ఓ బ్రిడ్జి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఇంట్లోనే చికిత్స పొందుతూ అన్ని పనులను తన మంత్రులకు అధికారులకు పురమాయించేవారు. మరోవైపు పారికర్‌ను బొమ్మను చేసి బీజేపీ అధినాయకత్వం ఆడిస్తోందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications