నీట మునిగిన మాన్యత టెక్ పార్క్- ఉక్కిరిబిక్కిరి
Bengaluru rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. అల్పపీడనంగా మారింది. తీరం వైపు తరుముకొస్తోంది. దీని ప్రభావంతో ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తోన్నాయి.
సిలికాన్ సిటీ బెంగళూరుపై దీని ప్రభావం అధికంగా కనిపించింది. నాలుగైదు రోజులుగా ప్రతి సాయంత్రం పూటా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బెంగళూరును పలకరిస్తోన్నాయి. ఆదివారం దీని తీవ్రత మరింత పెరిగింది. సాయంత్రం మొదలైన భారీ వర్షం రాత్రంతా కుండపోతగా కురిసింది.

దీని దెబ్బకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బలమైన ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. మే నెలలో ఈ స్థాయిలో అతి భారీ వర్షపాతం నమోదు కావడం 10 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి.
ఈ తెల్లవారుజామున 6 గంటల వరకు బెంగళూరు దక్షిణ ప్రాంతంలోని కెంగేరిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒక్క రాత్రిలో 132 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందిక్కడ. చామరాజనగర- 130, ఎన్ఎండీసీ క్యాంపస్- 125.8, సోమశెట్టిహళ్లి- 119.5, మాదనాయకనహళ్లి-116.5, యలహంక చౌడేశ్వరి- 103.5 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది.
కొడిగేహళ్లి- 100, కోరమంగళ- 96, హెచ్ఏఎల్- 93, మార్థహళ్లి- 92, రాజరాజేశ్వరి నగర- 80, హెచ్ఎస్ఆర్ లే అవుట్- 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డ్.. ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
ఈ వర్షాల దెబ్బ ఏ స్థాయిలో ఉందంటే- దేశంలో అతిపెద్ద ఐటీ హబ్ అయిన మాన్యత టెక్ పార్క్ నీట మునిగిపోయింది. 300 ఎకరాల్లో విస్తరించిన టెక్ పార్క్ ఇది. దాదాపుగా అన్ని ఐటీ కంపెనీల కార్యాలయాలు ఇక్కడ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్నాయి. ఆయా సంస్థల్లో వేలాదిమంది ఉద్యోగులు పని చేస్తుంటారు.
అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన హెబ్బాళ- కృష్ణరాజపురం రూట్‌లో ఉంటుందీ పార్క్. అలాంటి టెక్ పార్క్ ప్రాంగణంలోకి వర్షపునీరు పోటెత్తింది. సోమవారం కావడం వల్ల మాన్యత టెక్ పార్క్ లో ఉండే ఐటీ కార్యాలయాలన్నీ కూడా తెరచుకోవాల్సి ఉంది. వర్షపునీరు నిలిచిపోవడం వల్ల ఉద్యోగులకు కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
This water was meant to fill Bellandur and Varthur lakes. But for over two years, our ‘honest’ government has been busy filling its pockets instead of desilting the lakes.#BengaluruFloods #BengaluruRains #BengaluruRain
— Citizens Movement, East Bengaluru (@east_bengaluru) May 19, 2025
pic.twitter.com/xbS5jKLmsb
ఈజీపురాలో ఇళ్లల్లోకి వర్షపునీరు ప్రవేశించింది. హెణ్ణూర్ అండర్ పాస్ లో వరదనీరు పోటెత్తడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. శాంతినగర బీఎంటీసీ బస్ డిపోలో మోకాలి లోతు వర్షపు నిలిచింది. ఫలితంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
#ಸಂಚಾರಸಲಹೆ
— KG HALLI TRAFFIC BTP (@kghallitrfps) May 19, 2025
ಹೆಣ್ಣೂರು ಜಂಕ್ಷನ್ ಅಂಡರ್ ಪಾಸ್ ನಲ್ಲಿ ವಾಟರ್ ಲಾಗಿಂಗ್ ಆಗಿದ್ದು ನಾಗವಾರ ಕಡೆಗೆ ನಿಧಾನಗತಿಯ ಸಂಚಾರವಿರುತ್ತದೆ ಸಾರ್ವಜನಿಕರು ಸಹಕರಿಸಲು ಕೋರಿದೆ. @Jointcptraffic @DCPTrEastBCP @acpeasttraffic @blrcitytraffic pic.twitter.com/IXIOFp5pe1












Click it and Unblock the Notifications