థియేటర్‌లో.. నటికి లైంగిక వేధింపులు! తాగిన మైకంలో ఏం చేశాడంటే...
ప్రముఖ మరాఠీ నటి ప్రియా బెర్డేకు సినిమా థియేటర్ లో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె పక్క సీటులోనే కూర్చున్న ఓ తాగుబోతు ఆమెను లైంగికంగా వేధించాడు.
ముంబై: ప్రముఖ మరాఠీ నటి ప్రియా బెర్డేకు సినిమా థియేటర్ లో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె పక్క సీటులోనే కూర్చున్న ఓ తాగుబోతు ఆమెను లైంగికంగా వేధించాడు.
దివంగత నటుడు లక్ష్మీకాంత్ బెర్డే సతీమణి అయిన ప్రియా బెర్డే తన కుమార్తెతో కలిసి శనివారం సాయంత్రం ముంబైలోని ఓ థియేటర్ కు వచ్చారు. సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో ఆమె పక్క సీటులో కూర్చున్న వ్యక్తి ఆమెను తాకడం మొదలుపెట్టాడు.

ఆమెను లైంగికంగా వేధించడమే కాదు, ఆ తరువాత సదరు తాగుబోతు ఆమెపై ఏకంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్రియా బెర్డే వెంటనే థియేటర్ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.
పారిపోబోయిన ఆ తాగుబోతును సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ప్రియా బెర్డే పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు.
నిందితుడు స్థానిక వ్యాపారి సునీల్ జానీ(43)గా గుర్తించారు. అతడు తాగిన మైకంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. కామెడీ పాత్రలు ఎక్కువగా పోషించే ప్రియా బెర్డే మరాఠీలో, బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించారు. బాలీవుడ్ సినిమా 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమాలో కూడా నటించిన ఈమె గాయని కూడా.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications