పెద్ద నగదు నోట్ల రద్దు కష్టాలు, ఆ పెళ్ళికి ఐదువందలే ఖర్చు
పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని భరత్ పర్మార్, దక్షలు ఐదు వందల రూపాయాలతో వివాహం చేసుకొన్నారు. నగదు నోట్ల కష్టంతో రెండు కుటుంబాల పెద్దలు కూడ సాదాసీదాగా వివాహం జరుపుకొనేందుకు అంగీకరి
సూరత్: పెళ్ళిళ్ళను అొంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ గా మారిపోయింది. తల తాకట్టు పెట్టైనా ఆడంబరాలకు వెళ్ళి వివాహాలు చేస్తున్నారు. అయితే పెద్ద నగదు నోట్లు ప్రభావం పెళ్ళిళ్ళపై తీవ్రంగా చూపుతోంది. .కొందరు ఏకంగా పెళ్ళిళ్లను వాయిదా వేసుకొంటే..మరికొందరు పెళ్ళిళ్ళనురద్దుచేసుకొంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలో మాత్రం నగదు కష్టాల కారణంగా టీ ఖర్చులు భరించి వివాహం జరిపించారు. ఐదువందలను మాత్రమే ఖర్చు చేశారు.
గుజరాత్ రాష్ట్రంలోని భరత్ పర్మార్, దక్ష ఐదు వందల రూపాయాలతో వివాహం చేసుకొన్నారు. వివాహన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని భావించినా పెద్ద నగదు నోట్ల ప్రభావంతో సాదాసీదాగానే జరిపించారు.

పెద్ద నగదు నోట్లు రద్దు కావడంతో వివాహం జరిపించాలని భావించారు. అయితే ఘనంగా వివాహం జరిపించాలంటే డబ్బు చేతికి అందే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో వధువు, వరుడు పెద్దలను ఓప్పించారు. ఆడంబరాలకు పోలేదు.
వధువు, వరుడు చెప్పినట్టుగానే పెద్దలు కూడ అంగీకరించారు. వివాహన్ని సాదాసీదాగానే జరిపించారు. టీ, మంచినీళ్ళతో అతిథులను ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. వివాహం ఘనంగా జరిగిందని వధువు, వరుడు సంతృప్తి చెందుతున్నారు. వివాహనికి వచ్చిన అతిథులు కూడ వివాహం పరిస్థితులను అర్థ: చేసుకొన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications