Marriage: కొత్త పెళ్లికూతురిని 25 సార్లు కత్తితో పొడిచిన శాడిస్టు భర్త !
చెన్నై: యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని ఇరువైపుల పెద్దలు మాట్లాడుకున్నారు. యువతికి 18 ఏళ్లు మాత్రమే కావడంతో మొదట ఆలోచించిన అమ్మాయి కుటుంబ సభ్యులు తరువాత పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యారు. వివాహం చేసుకోవడానికి యువతి, యువకుడు అంగీకరించారు. కొన్ని నెలల క్రితం బంధువులు, స్నేహితులు సమక్షంలో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన నెల రోజుల తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త కత్తి తీసుకుని నవ వధువులు 25 సార్లు పొడి చేయడం కలకలం రేపింది.

మొదట్లో ఆలోచించారు
చెన్నై సిటీలోని కోరుక్కుపేట్ లోని ఎగప్పన్ వీధిలో తమిళ సెల్వి అలియాస్ సెల్వీ (18) అనే యువతి నివాసం ఉంటున్నది. అదే ప్రాంతంలో ప్రసాద్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సెల్వీ, ప్రసాద్ కు పెళ్లి చేద్దామని ఇరువైపుల పెద్దలు మాట్లాడుకున్నారు. సెల్వీకి ఇంకా 18 ఏళ్లు మాత్రమే అని, రెండు సంవత్సరాల తరువాత పెళ్లి చేద్దామని బంధువులు కొందరు చెప్పారు.

మూడు నెలల క్రితం పెళ్లి
బంధువులు ఆలోచించి చర్చలు జరిపిన తరువాత సెల్వీ కుటుంబ సభ్యులు ప్రసాద్ తో ఆమె పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యారు. ప్రసాద్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం బంధువులు, స్నేహితులు సమక్షంలో చెన్నైలోనే ప్రసాద్, సెల్వీల పెళ్లి జరిగింది. వివాహం జరిగిన నెల రోజులు కాకుండానే ప్రసాద్, సెల్వీ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

మద్యం మత్తులో ఎంజాయ్..... నిలదీసిన నవవధువు
పెళ్లి జరిగిన రోజు నుంచి ప్రతిరోజు రాత్రి ప్రసాద్ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య సెల్వీ మీద చిందులు వేస్తున్నాడు. ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు సక్రమంగా ఇవ్వకుండా మద్యం సేవిస్తున్న ప్రసాద్ అతనిపాటికి అతను ఎంజాయ్ చేస్తున్నాడు. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన ప్రసాద్ ను అతని భార్య నిలదీసింది.

భార్యను 25 సార్లు పొడిచిన శాడిస్టు భర్త
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన ప్రసాద్ వంట గదిలో కత్తి తీసుకుని అతని భార్య సెల్వీని 25 సార్లు పొడిచేశాడు. సెల్వీ కేకలు వెయ్యడంతో స్థానికులు ఆమెను రక్షించి చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య సెల్వీని దారుణంగా పొడిచి తప్పించుకుని పారిపోయిన ప్రసాద్ తరువాత పోలీసులకు చిక్కిపోయాడు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications