Marriage: పెళ్లి ఇంటిలో పేలిపోయిన గ్యాస్ సిలిండర్, పెళ్లి టైమ్ లో ?, సీఎం షాక్, ప్రాణాలు !
జైపూర్/రాజస్థాన్: యువతి, యువకుడి పెళ్లి చెయ్యాలని పెద్దలు డిసైడ్ అయ్యారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇరువైపుల ఇంటిలో పెళ్లి సందడి మొదలైయ్యింది. ఇంటిలో వంటలు చెయ్యడం మొదలుపెట్టారు. పెళ్లి కొడుకు కల్యాణపండపం దగ్గరకు ఊరేగింపుగా బయలుదేరడానికి సిద్దం అయ్యాడు. అదే సమయంలో దారుణం జరిగిపోయింది.
రాజస్థాన్ లోని భంగ్రా గ్రామంలో నివాసం ఉంటున్న యువతికి, వేరే గ్రామంలో నివాసం ఉంటున్న యువకుడికి పెళ్లి నిశ్చయం అయ్యింది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇరువైపుల కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. పెళ్లికి కల్యాణపండపం వేదిక సిద్దం అయ్యింది. పెళ్లి కొడుకు. పెళ్లికూతురి ఇంటిలో వీడియె కెమెరాలు ఆన్ అయ్యాయి.

పెళ్లికొడుకు కల్యాణపండపం దగ్గరకు ఊరేగింపుగా బయలుదేరడానికి వాహనం సిద్దం అయ్యింది. డీజే మ్యూజిక్ ఆన్ అయ్యింది. ఇదే సమయంలో పెళ్లి ఇంటిలో వంటలు చేస్తున్న చోట గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో 5 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మొత్తం 52 మందికి తీవ్రగాయాలైనాయి.
తీవ్రగాయాలైన వారిలో 21 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గైహ్లాడ్ గ్యాస్ సిలిండర్ పేలుడులో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రగాయాలైన వారికి రూ. 1 లక్ష పరిహారం ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ పేలుడు ఎలా జరిగింది అనే విషయంపై రాజస్థాన్ సీఎం అశోక్ గైహ్లాట్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని గంటల్లో జంట ఒకటి కానున్న సమయంలో పెళ్లి ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిపోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications