Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభలేఖల దిశగా: ఏడాది చివరలో కోహ్లీ-అనుష్క పెళ్లి?

న్యూఢిల్లీ/మెల్బోర్న్: గత కొంత కాలంగా ఘాటుగా ప్రేమించుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీలు త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వారి మధ్య కొనసాగుతున్న బంధాన్ని బహిరంగంగానే అంగీకరించిన విషయం తెలిసిందే.

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మెల్బోర్న్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తన ప్రియురాలు నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఎన్‌హెచ్ 10' సినిమా చూశాడు. ఆ తర్వాత తన ప్రియురాలు నటనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సినిమాలో అనుష్క నటన అద్భుతంగా ఉందని ట్విట్టర్‌లో కొనియాడాడు. ఇందుకు ఎంతో మురిసిపోయిన అనుష్క శర్మ కూడా ట్విట్టర్లో స్పందించారు. కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపారు.

Marriage on cards: Virat Kohli, Anushka Sharma to tie the knot by the end of the year?

ప్రేమించుకోవడాలు ముగిసాయి.. ఇక తదుపరి కార్యక్రమమే మిగిలిందని ఇటీవల వీరిద్దరూ పేర్కొన్నారు. ఓ ప్రముఖ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఈ ప్రేమ జంట 2015 ఏడాది చివరిలోగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

ఎన్‌హెచ్ 10 సినిమాలో అనుష్క నటకు అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుతున్నాయి. అయితే వాటన్నింటికంటే కోహ్లీ నుంచి అభినందన రావడం అనుష్కకు ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేగాక, కోహ్లీ.. అనుష్క నటనను మెచ్చుకోవడమే కాకుండా.. తన ప్రేయసి అని సంబోధించాడు.

Marriage on cards: Virat Kohli, Anushka Sharma to tie the knot by the end of the year?

కోహ్లీ ప్రశంసించడంతోపాటు తన ప్రేమను వ్యక్త పర్చడంతో అనుష్క శర్మ చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లీ ప్రశంస అందిన వెంటనే అనుష్క కూడా.. కృతజ్ఞతలు చెబుతూ ట్విట్టర్ సందేశం పంపింది. అంతకుముందు విరాట్ కోహ్లీ ఓ మ్యాచులో సెంచరీ చేసిన అనంతరం స్టేడియంలో ఉన్న అనుష్క‌కు ఫ్లైవింగ్ కిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీతో బంధంతో అనుష్క స్పందించింది. ‘నేను కోహ్లీతో సంబంధం కలిగి వున్నాను. నేను నా బంధం పట్ల గౌరవ భావంతో ఉన్నాను' అని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+