Marriage: పైనికుడి రెండో పెళ్లి, కల్యాణమండపంలో మొదటి భార్య ఎంట్రీ, రాత్రి భార్యతో !
బెంగళూరు/హాసన్: యువకుడు సైన్యంలో ఉద్యోగం చేస్తున్నాడు. సైనికుడికి అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. మంచి అమ్మాయిని చూసిన కుటుంబ సభ్యులు పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. పెళ్లి చేసుకోవడానికి సైనికుడు వచ్చాడు. కల్యాణమండపంలో సైనికుడి పెళ్లికి బంధువులు, స్నేహితులు అందరూ హాజరైనారు. ముహూర్తానికి పదినిమిషాల ముందు ఓ మహిళ పోలీసులతో కలిసి ఎంట్రీ ఇచ్చింది. సైనికుడు గతంలో నన్ను పెళ్లి చేసుకున్నాడని ఆమె మెడలో ఉన్న తాళిని పెళ్లికి వచ్చినవారికి చూపించింది. రాద్దాంతం జరుగుతున్న సమయంలో సైనికుడు పెళ్లికూతురు మెడలో తాళి కట్టేశాడు. తరువాత కథ రసవత్తరంగా మారింది. పెద్దలు, పోలీసులు పంచాయితీలు చేశారు. మరుసటి రోజు ఉదయం సైనికుడు, అతని మొదటి భార్య ఊరి బయట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోని కనిపించడం కలకలం రేపింది.

సైనికుడికి పెళ్లి
కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని శాంతిగ్రామంలో కిరణ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి కిరణ్ సైన్యంలో ఉద్యోగం చేస్తున్నాడు. సైనికుడు కిరణ్ కు చాలాకాలం నుంచి అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. మంచి అమ్మాయిని చూసిన కుటుంబ సభ్యులు కిరణ్ పెళ్లి ఈనెల 10వ తేదీ డేట్ ఫిక్స్ చేశారు.

మొదటి భార్య ఎంట్రీ
శుక్రవారం హాసన్ సమీపంలోని బూవనహళ్లి బైపాస్ రోడ్డులోని కల్యాణమండపంలో పెళ్లి చేసుకోవడానికి సైనికుడు కిరణ్ కొంతకాలం క్రితమే సొంత గ్రామానికి వచ్చాడు. కల్యాణమండపంలో శుక్రవారం జరిగిన సైనికుడు కిరణ్ పెళ్లికి బంధువులు, స్నేహితులు అందరూ హాజరైనారు. ముహూర్తానికి పదినిమిషాల ముందు ఓ మహిళ పోలీసులతో కలిసి కల్యాణమండపంలోకి ఎంట్రీ ఇచ్చింది.

నన్ను పెళ్లి చేసుకున్నాడు
తన భర్త చనిపోయాడని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, చాలాకాలం నుంచి సైనికుడు కిరణ్ తనతో కాపురం చేస్తున్నాడని, మా ఇంటిలోనే తన మెడలో తాళికట్టి తనను పెళ్లి చేసుకున్నాడని ఆమె మెడలో ఉన్న తాళిని పెళ్లికి వచ్చినవారికి చూపించింది. ఆ సందర్బంలో కల్యాణమండపంలో రచ్చరచ్చ జరిగింది.

తాళి విసిరేసిన పెళ్లికూతురు
కల్యాణమండపంలో గొడవ జరగుతున్న సమయంలోనే కిరణ్ పెళ్లికూతురి మెడలో తాళికట్టేశాడు. తరువాత పెద్దలు, పోలీసులు పంచాయితీలు చేశారు. ఆ సందర్బంలో పెళ్లికూతురు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి కిరణ్ కట్టిన తాళిని తీసి అతని చేతిలో పెట్టి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోయింది.

మొదటి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సైనికుడు
పోలీసులు, కిరణ్ పంచాయితీలు చేసి అందరిని కల్యాణమండపంలో నుంచి పంపించారు. శుక్రవారం రాత్రి సైనికుడు కిరణ్ అతని మొదటి భార్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. తరువాత ఇద్దరూ ఆమె ఇంటిలోనే గొడవపడ్డారు. శనివారం శాంతిగ్రామం సమీపంలోని నీలగిరి తోట సైనికుడు కిరణ్, అతని మొదటి భార్య చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండో పెళ్లి జరిగిన రోజే సైనికుడు కిరణ్ అతని మొదటి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications