Marriage: ఉదయం నిశ్చితార్థం, రాత్రి తోటలో విషం తాగి ఆత్మహత్య, ఏం జరిగిందంటే ? !
బెంగళూరు/ గదగ్: వ్యాపారం చేస్తున్న యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు, డబ్బు సంపాధిస్తున్న యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఓ అమ్మాయిని సెట్ చేసిన పెద్దలు ఆ యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. నిశ్చితార్థం చేసుకుని ఊరికి వెళ్లిన యువకుడు అదే రోజు విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని గజేంద్రగఢ్ తాలుకాలోని రాజూరు గ్రామంలో కళకప్ప (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కూరగాయాలు, నిత్యవసర వస్తువుల వ్యాపారం చేస్తున్న కళకప్ప డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న కళకప్ప పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు, డబ్బు సంపాధిస్తున్న కళకప్పకు పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

ఓ అమ్మాయిని చూసిన కుటుంబ సభ్యులు కళకప్పతో ఆమె పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. కళకప్ప కూడా ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని పెద్దలకు చెప్పాడు. రాత్రి కటింగ్, షేవింగ్ చేసుకుని శుభ్రంగా తయారైనాడు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులతో కలిసి కళకప్ప పెళ్లి కూతురికి ఇంటికి వెళ్లాడు.
ఆ అమ్మాయితో కళకప్ప నిశ్చితార్థం జరిపించారు. యువతితో నిశ్చితార్థం చేసుకున్న కళకప్ప రాత్రి అతని ఊరికి వెళ్లాడు. రాత్రి స్నేహితులతో మాట్లాడిన కళకప్ప తరువాత ఊరి సమీపంలోని సాహుకార అన్నార్ కు చెందిన తోటలోకి వెళ్లి విషం సేవించిన కళకప్ప అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిశ్చితార్థం చేసుకున్న రోజే కళకప్ప ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు.












Click it and Unblock the Notifications