9పెళ్లిళ్లు చేసుకుని ఏడో భార్యకు దొరికిపోయాడు!: ఎలాగంటే..?
Recommended Video

లక్నో: ఒకరికి తెలియకుండా మరొకరితో తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న ఓ ప్రబుద్ధుడు ఎట్టకేలకు ఏడో భార్యకు దొరికిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఏడో భార్య అంటూ..
రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన సమీర్ అనే వ్యక్తికి ఏడాది క్రితం లక్నోకు చెందిన అప్షా అనే యువతితో వివాహం జరిగింది. అయితే, ఆమెను ఎప్పుడూ ‘నువ్వు నా ఏడో భార్యవు' అంటూ సమీర్ ఆటపట్టిస్తుండేవాడు. అఫ్షా కూడా తన భర్త ఏదో సరదాగా అంటున్నాడని అనుకునేది.

మరో యువతితో ఫోన్లో..
కాగా, నేహా అనే యువతి తన భర్తకు తరచూ ఫోన్లు చేస్తుండటంతో అఫ్షాకు అనుమానం వచ్చింది. అతను ఫోన్ కూడా చూడటానికి ఒప్పుకోకపోవడంతో అఫ్షా అనుమానం మరింత బలపడింది.

అఫ్షాకు షాక్..
ఈ క్రమంలో ఓసారి సమీర్‌కు తెలియకుండా తన ఫోనులో నేహా నెంబరు తీసుకుని ఫోన్ చేసి ఆరా తీసింది. తాను సమీర్ భార్యను అని చెప్పేసరికి నేహా చెప్పడంతో అఫ్షాకు దిగ్భ్రాంతికి గురైంది.

9వ భార్యవంటూ నేహాను..
అంతేగాక, అఫ్షాను ఎలాగైతే ఏడో భార్య అని అంటుండేవాడో.. నేహాను తనకు తొమ్మిదో భార్య అని అంటుండేవాడట సమీర్. దీంతో సమీర్ ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలుసుకున్న అఫ్షా పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసుల సమీర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తాను మూడు పెళ్లిళ్లే చేసుకున్నానని సమీర్ చెప్పాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని కలుస్తూ బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications