Khiladi wife: చిత్రాకు భర్త, ముగ్గురు సీక్రెట్ ప్రియులు, ఒకడిని కోసి కారం పెట్టేసింది, ఏడాదికి !
చెన్నై/ తిరుప్పూర్: వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న మహిళ బంధువులైన ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకునింది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరిలో ఓ మైనర్ ఉన్నాడు. భర్తతో ఉంటూనే మరో ఇద్దరు ప్రియులతో భార్య పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. మహిళ విషయంలో ఇద్దరు ప్రియులు గొడవపడ్డారు. గొడవ పెద్దది కావడంతో భార్య మైనర్ ప్రియుడితో కలిసి రెండో ప్రియుడిని చంపేసింది. భర్త సహాయంతో కిలాడీ లేడి, ఆమె ప్రియుడు కలిసి హత్యకు గురైన ప్రియుడు శవాన్ని ఫామ్ హౌస్ లో ఉప్పు, కారం పెట్టి పాతిపెట్టేసి పైన చెట్లు నాటేశారు. ఏడాది తరువాత కిలాడీ లేడి మరో ప్రియుడిని తగులుకుంది. ఇప్పుడు కిలాడీ లేడీకి భర్తతో పాటు మరో ఇద్దరు ప్రియులు ఉన్నారు. నేను చెప్పినట్లు వినాలి, నేను చెప్పినట్లు చెయ్యాలి, లేదంటే నా పాత ప్రియుడిని ఎలా చంపేశామో అలాగే నిన్ను చంపేస్తామని ప్రియుడికి కిలాడీ లేడీ వార్నింగ్ ఇచ్చింది. ప్రియురాలి దెబ్బతో హడలిపోయిన కొత్త ప్రియుడు పోలీసులను ఆశ్రయించాడు. కొత్త ప్రియుడి దెబ్బతో భార్య, భర్త, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. కిలాడీ లేడీ చేతిలో హత్యకు గురైన వ్యక్తి హస్తిపంజరం బయటకు తియ్యడం కలకలం రేపింది.

కిలాడీ లేడీ కాపురం
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని చిన్నక్కంపాళ్యంలో రమేష్ (32) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం రమేష్ చిత్రా (23) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. భర్త రమేష్ తో కాపురం చేస్తున్న చిత్రా జగత్ కిలాడి. భర్త రమేష్ తో కాపురం చేస్తున్న చిత్రాకు వయసు తక్కువే అయినా టెక్నీక్ లు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి.

పేరు చిత్రా..... క్యారెక్టర్ మాత్రం చిత్రాంగి
చిత్రాకు సమీప బంధువులైన మణికందన్ (20), మరో 16 ఏళ్ల వయసు ఉన్న మైనర్లతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త రమేష్ తో కాపురం చేస్తున్న చిత్రా ఒకేసారి ఇద్దరు ప్రియులను లైన్ లో పెట్టి ముగ్గురితో ఎంజాయ్ చేసింది. కొంతకాలం మైనర్, మణికందన్ ఒకరికి తెలీకుండా ఒకరు చిత్రాతో ఎంజాయ్ చేశారు

ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లతో చిత్రా ?
రమేష్, అతని భార్య చిత్రా, మణికందన్, మైనర్ ప్రియుడు ఒకే ఫామ్ హౌస్ లో పని చేస్తున్నారు. ఒకేచోట అందరూ పని చేస్తుండటంతో ఎవరు పనిలో ఉంటారు, ఎవరు ఖాళీగా ఉంటారో అనే విషయం చిత్రాకు బాగా తెలుసు. భర్త రమేష్ కాకుండా మణికందన్, మైనర్ లో ఎవరు ఎవరు ఖాళీగా ఉంటారో వారితో చిత్రా ఎంజాయ్ చేస్తోంది.

ఒక ప్రియుడు మంచి సీన్ చూసేశాడు
చిత్రా, మైనర్ మంచి రసపట్టులో ఉన్న సమయంలో ఇద్దరిని మరో ప్రియుడు మణికందన్ రెడ్ హ్యాండెగ్ గా చూసేశాడు. అప్పటి నుంచి మణికందన్, మైనర్ అబ్బాయి మద్య గొడవలు మొదలైనాయి. ఇద్దరు ప్రియులకు చిత్రా సర్దిచెబుతూ వచ్చింది. అయితే అప్పుడప్పుడు మణికందన్, మైనర్ అబ్బాయి వారి ప్రియురాలు చిత్రా కోసం గొడవ పడుతూనే ఉన్నారు.

భర్త ముందే ప్రియురాలి కోసం ఫైటింగ్
2020లో ఆగస్టు నెలలో లాక్ డౌన్ సడలించిన సమయంలో మణికందన్, మైనర్ అబ్బాయి కలిసి మార్కెట్ లో కూరగాయలు తీసుకురావడానికి వెళ్లారు. ఆ సమయంలో మద్యం సేవించిన ఇద్దరూ ప్రియురాలు చిత్రా కోసం గొడవపడ్డారు. మద్యం మత్తులో మార్కెట్ లో గొడవపడి తరువాత ఇద్దరూ ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో మళ్లీ గొడవపడటంతో చిత్రా భర్త రమేష్ వారిద్దరికి సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు.

ప్రియుడిని పైకి పంపించేసిన చిత్రాంగి
గొడవ జరిగే సమయంలో మణికందన్ రెచ్చిపోయి చిత్రా భర్త రమేష్ మీద దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిత్రా, ఆమె మైనర్ ప్రియుడు కలిసి ఇనుప రాడ్లు తీసుకుని మణికందన్ తల మీద దాడి చేసి అతన్ని కోసి కారం పెట్టినట్లు చంపేశారు. ఫామ్ హౌస్ లో మణికందన్ హత్యకు గురికావడంతో ఆ విషయం బయటకు రాలేదు. తరువాత చిత్రా, ఆమె భర్త రమేష్, కిలాడీ లేడీ మైనర్ ప్రియుడు కలిసి మణికందన్ శవాన్ని ఫామ్ హౌస్ లో పూడ్చిపెట్టి పైన చెట్లు నాటేశారు.

ప్రియుడి కేసు బయటకు రాలేదు
మణికందన్ చాలాకాలం కనపడకపోవడంతో అతని కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే మణికందన్ తో అతని కుటుంబ సభ్యులకు అంతంతమాత్రంగానే సంబంధాలు ఉండటంతో అతని గురించి వారు పెద్దగా పట్టించుకోలేదు. మణికందన్ హత్య తరువాత చిత్రా ఆమె భర్త రమేష్ తో, మైనర్ ప్రియుడితో ఎంజాయ్ చేసింది.

ముచ్చటగా మూడో ప్రియుడు ఎంట్రీ
తరువాత ఫామ్ హౌస్ లో పని చెయ్యడానికి వచ్చిన నందకుమార్ (25) అనే యువకుడితో చిత్రా అక్రమ సంబంధం పెట్టుకునింది. నందకుమార్ తో ఎంజాయ్ చేస్తున్న చిత్రా ఇటీవల రెండు నెలల గర్బవతి అయ్యింది. రానురాను చిత్రా నందకుమార్ మీద కమాండింగ్ చెయ్యడం మొదలుపెట్టింది. చిత్రా తీరుతో భయపడిన నందకుమార్ ఆమెకు దూరం కావడానికి ప్రయత్నించాడు. నేను చెప్పినట్లు నువ్వు వినాలి, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి, లేదంటే నా పాత ప్రియుడు మణికందన్ ను ఎలా చంపేశామో అలాగే నిన్ను చంపేస్తామని కొత్త ప్రియుడు నందకుమార్ కు కిలాడీ లేడీ చిత్రా వార్నింగ్ ఇచ్చింది.
Recommended Video

హస్తిపంజరం మాత్రం మిగిలింది
చిత్రా తీరు బాగా తెలిసిన నందకుమార్ పోలీసులను ఆశ్రయించి హత్యకు గురైన మణికందన్, చిత్రా వ్యవహారం గురించి చెప్పాడు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి చిత్రా, ఆమె భర్త రమేష్, మైనర్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. మణికందన్ ను హత్య చేసినట్లు ముగ్గురు అంగీకరించారు. మణికందన్ శవం బయటకు తియ్యాలని పోలీసులు గోతి తియ్యడంతో అతని హస్తిపంజరం మాత్రం బయటకు వచ్చింది. మణికందన్ హస్తిపంజరం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. భర్త కాకుండా ముగ్గురు ప్రియులతో ఎంజాయ్ చేసిన కిలాడీ లేడి ఓ ప్రియుడిని కోసం కారం పెట్టేసి ఏడాది తరువాత పోలీసులకు చిక్కిపోవడం కలకలం రేపింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications