కొత్త పెళ్లి కూతురిపై ఆడపడుచు భర్త రేప్, భర్త సహకారం

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మహిళల పైన దారుణాలు కొనసాగుతున్నాయి. కొత్త పెళ్లి కూతురు సొంత ఇంట్లోనే అత్యాచారానికి గురైంది. ఘజియాబాద్‌లో ఓ యువతికి షాన్ మహ్మద్ అనే యువకుడితో ఈ మధ్యే పెళ్లైంది. పెళ్లి తరువాత రక్తసంబంధీకుల ఇంటికి వెళ్లే సంప్రదాయం ప్రకారం స్థానిక షహీద్‌నగర్‌లో ఉంటున్న ఆడపడుచు ఇంటికి భార్య, భర్త కలసి వెళ్లారు.

బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో భర్త షాన్ మహ్మద్, ఆడపడుచు రేష్మ సహకారంతో ఆమె భర్త షంషద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. బాధితురాలు మహ్మద్‌ను ఫిబ్రవరి 16, 2014న పెళ్లి చేసుకుంది. తన గదికి నిందితుడు వచ్చినప్పుడు.. అరిచే ప్రయత్నం చేయగా భర్త తన నోరు మూశాడని ఫిర్యాదులో పేర్కొంది.

Married woman allegedly raped by relative

మహిళను రేప్ చేసిన పోలీసు

ఉత్తర ప్రదేశ్‌లోని బలరాంపుర్ జిల్లాలో ఓ పోలీసు ఓ మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఒకరోజు క్రితం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సదరు పోలీసు పైన కేసు నమోదు చేశామని, అలాగే అతనిని సస్పెండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+