భర్తకు బెయిల్.. పోలీసులకు చుక్కలు.. పీఎస్‌పై మహిళ దాడి
టెక్కలి : పోలీసులకు చుక్కలు చూపించారు ఓ మహిళ. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హంగామా చేశారు. ఆమె హల్‌చల్ చూసి ఖాకీలే కంగు తినాల్సిన పరిస్థితి ఎదురైంది. చూసుకో నా తడాఖా అనే రేంజ్‌లో సదరు వివాహిత రెచ్చిపోయిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది.
పాత పట్నం ఏరియాకు చెందిన వందనా దేవికి.. భవానీ పురానికి చెందిన నాగరాజుతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అయితే గత ఐదేళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ క్రమంలో విడిగా ఉంటున్నారు ఇద్దరు. కుటుంబ వివాదాల కేసు కూడా కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగరాజుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసి టెక్కలి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

అలా అరెస్ట్ చేశారో లేదో ఇలా అతడు బెయిల్‌పై బయటకు వెళ్లాడనేది వందనా దేవి కోపానికి కారణం. దాంతో ఆమె పోలీసుల తీరును తప్పు పట్టారు. అరెస్ట్ చేసిన వెంటనే విడుదల చేస్తారా అంటూ ఖాకీలపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఆ కోపంలో పోలీస్ స్టేషన్ అద్దాలు ధ్వంసం చేశారు. స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ జీపుపై కూడా దాడి చేశారు.
ఇదంతా చూస్తున్న పోలీసులు ఆమెను నిలువరించ లేకపోయారు. పోలీసుల పక్షపాత ధోరణితోనే నాగరాజును విడిచి పెట్టారనేది ఆమె వాదన. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడమే గాకుండా తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మొత్తానికి సదరు వివాహిత వీరంగంతో కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications