అత్యాచారానికి ప్రయత్నించిన యువకుడు.. ప్రైవేట్ పార్ట్ కోసేసిన వివాహిత..
ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి యత్నించిన ఓ యువకుడి ప్రైవేట్ పార్ట్‌ను కట్‌చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనపై సదరు యువకుడు చెబుతోన్న వెర్షన్ మరోలా ఉంది. ఇంతకీ, సినిమా స్టోరీని తలపిస్తోన్నఈ ఘటనలో చోటుచేసుకున్నఅసలు వాస్తవాలేంటో చూద్దాం..
కత్తితో యువకుడి ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వివాహిత : ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లాలోని మంజన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ వివాహిత నివాసముంటోంది. ఆమె భర్త ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడే ఆయన డ్రైవర్‌గా విధులు నిర్విర్తిస్తున్నారు. అయితే ఆ వివాహిత ఇంట్లో ఎన్నో ఏళ్ల నుంచి నిజాముద్దీన్ అనే యువకుడు పనిచేస్తూ ఉన్నాడు. అయితే, ఆ యువకుడి మనసులో ఎలాంటి దురాలోచన కలిగిందో తెలియదు కానీ, ఆమెపై అత్యాచార యత్నానికి సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ఎంతో తెలివిగా అతన్ని మాటల్లో పెట్టి అతన్ని నుండి విడిపించుకుని వచ్చింది. ఆ తర్వాత తన వంటగదిలోకి వెళ్లి కత్తితీసుకుని వచ్చి అతని ప్రైవేట్ పార్ట్‌ను కోసేసింది. ఆ నొప్పి భరించలేని యువకుడు అక్కడినుంచి పరారయ్యాడు.

విషయాన్ని పూర్తిగా ఖండించిన యువకుడు : అక్కడితో ఆ వివాహిత ఆగిపోకుండా, ఆ ప్రైవేట్ పార్ట్‌ను ఓ సంచిలో తీసుకెళ్లి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ తర్వాత వివాహిత మహిళ చేసిన సాహసానికి పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటనపై ఆ వివాహిత పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా, ఆ యువకుడిని అతని బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఈ విషయాన్ని నిందితుడు పూర్తిగా ఖండించినట్లు తెలుస్తోంది.
ఆ యువకుడు ఓ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... తాను చిన్నప్పటి నుంచి ఆ మహిళ వద్ద పని చేస్తున్నాని, మంగళవారం ఆమె తనకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించిందని చెప్పాడు. అయితే తన నోట్లో రుమాలు పెట్టి, తను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తరువాత తన ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిందని తెలిపాడు. తాను స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసిందని చెప్పాడు. అయితే, ఈ సంఘటనపై పోలీసులు ఇరువర్గాలను విచారిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications