వివాహితపై గ్యాంగ్ రేప్, హత్య: బంధువు పనే
చండీఘర్: హర్యానాలో ఓ వివాహిత పట్ల అమానుషం జరిగింది. ఓ 35 ఏళ్ల వివాహితపై ఆమె బంధువుతో పాటు మరో నలుగురు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను చంపేశారు. హర్యానాలోని మేవాట్ జిల్లాలో మంగళవారంనాడు ఆ సంఘటన జరిగింది.
ప్రధాన నిందితుడు మృతురాలి మామకు సన్నిహిత బంధువు. అతను ఆమెను పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకుని రావడానికి వెళ్లాడు. పుట్టింట్లో ఆమెను అతను కారులో ఎక్కించుకున్నాడు. ఆమెను అత్తారింటికి తీసుకుని వెళ్లడానికి బదులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఆమెపై అతనితో పాటు మరో నలుగురు అత్యాచారం చేసి, ఆమెను చంపేశారు. ప్రధాన నిందితుడిపై, ఇతరులపై కేసు నమోదు చేసినట్లు మేవాట్ పోలీసు సూపరింటిండెంట్ కుల్దీప్ సింగ్ బుధవారంనాడు చెప్పారు.
అటుగా వెళ్తున్న కొంత మంది శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలం వద్ద బీర్ బాటిల్స్, పగిలిన చేతి గాజులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications