lady: టాప్ మోడల్ చేస్తానని ఫామ్ హౌస్ లో ఫేస్ బుక్ ఫ్రెండ్ రేప్, రివాల్వర్ గురిపెట్టి, పొలిటికల్ లీడర్ !
బెంగళూరు: ఫేస్ బుక్ లో పరిచయం అయిన వివాహిత మహిళ మీద అత్యాచారం చేశాడని నమోదైన కేసులో పొలిటికల్ లీడర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మోడలింగ్ లో నీకు మంచి భవిష్యత్తు ఉంది. నిన్ను మంచి మోడల్ చేస్తా, దేశవ్యాప్తంగా నీకు మంచి గుర్తింపు తెప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని వివాహిత మహిళ కేసు పెట్టింది. తనను నమ్మించి ఫామ్ హౌస్ కు పిలింపించి తన కూతురిని బయటకు పంపించి, ఫామ్ హౌస్ లో తనకు రివాల్వర్ తో బెదిరించి తన మీద అత్యాచారం చేసి తన నగ్నవీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పొలిటికల్ లీడర్ మీద కేసు పెట్టింది.

పొలిటికల్ లీడర్ కు ఫేస్ బుక్ ఫ్రెండ్
బెంగళూరు నగర శివార్లలోని బన్నేరుఘట్ట గ్రామ పంచాయితీ సభ్యుడు అహమ్మద్ పాషా అనే వ్యక్తికి కొంతకాలం క్రితం బెంగళూరులోని బీటీఎం లేఔట్ లో నివాసం ఉంటున్న రెజీనా (పేరు మార్చడం జరిగింది) అనే వివాహిత మహిళకు ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. కొంతకాలం నుంచి అహమ్మద్, రెజీనా ఫేస్ బుక్ లో చాటింగ్ చేసుకుంటున్నారు.

నువ్వు ఫేమస్ అయిపోతావు.... నో డౌట్
కొంతకాలం గడిచిన తరువాత అహమ్మద్, రెజీనా మొబైల్ నెంబర్లు మార్చుకుని ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. రెజీనా చూడటానికి చాలా అందంగా ఉండటం, ఆమె ఇంతకు ముందు తీసుకున్న ఫోటోలు చూసిన గ్రామపంచాయితీ సభ్యుడు అహమ్మద్ ఆమెకు బిస్కెట్ వేశాడని సమాచారం. నువ్వు మోడలింగ్ రంగంలోకి వస్తే నీకు మంచి గుర్తింపు వస్తుందని, తక్కువ కాలంలోనే నీకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని, అందులో డౌట్ లేదని ఆమెకు బిస్కేట్ వేశాడు.

మునగ చెట్టు ఎక్కి కుర్చున్న మహిళ
తనకు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారని మరిచిపోయిన రెజీనా పొలిటికల్ లీడర్ అహమ్మద్ చెప్పిన మాటలకు మునగ చెట్టు ఎక్కి కుర్చోంది. నేను సినిమా హీరోయిన్ లా ఉంటానని ఉబ్బిపోయిన రెజీనా అహమ్మద్ ఆడినట్లు ఆడింది. నువ్వు నేను ఉన్న చోటకు వస్తే నీతో చాలా మాట్లాడాలని, నువ్వు ఎలా మోడలింగ్ చెయ్యాలో నేను పూర్తిగా వివరిస్తానవని, తనకు సినిమా హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు చాలా మంది తెలుసని, వారి సహాయంతో నీకు మోడలింగ్ రంగంలో అవకాశాలు ఇప్పిస్తానని అహమ్మద్ ఫేస్ బుక్ ఫ్రెండ్ రెజీనాకు చెప్పాడని తెలిసింది.

కారులో ఫామ్ హౌస్ కు వెళ్లిపోయింది
జూన్ 14వ తేదీ అహమ్మద్ ఓలా క్యాబ్ బుక్ చేసి ఆ కారును బెంగళూరులోని బీటీఎం లేఔట్ లోని బిలాల్ మసీదు సమీపంలోకి పంపించాడు. మసీదు సమీపంలోని వెళ్లిన కారులో రెజీనా ఆమె కూతురు ఎక్కారు. కారు నేరుగా బన్నేరుఘట్ట సమీపంలోని బిల్డరహళ్ళి దగ్గర ఉన్న ఫామ్ హౌస్ లోపలికి వెళ్లిపోయింది.

రివాల్వర్ తో బెదిరించి రేప్ ?
ఫామ్ హౌస్ లో అప్పటికే మకాం వేసిన అహమ్మద్ కారులో వెళ్లిన రెజీనా దగ్గరకు వెళ్లాడు. రెజీనా కుమార్తెను భోజనం తినిపించాలని అహమ్మద్ అతని కారు డ్రైవర్ వహీద్ కు చెప్పాడు. కారు డ్రైవర్ రెజీనా కుమార్తెను పిలుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత ఫామ్ హౌస్ చూపిస్తానని తనను పిలుచుకుని వెళ్లిన అహమ్మద్ ఓ రూమ్ లోకి పిలుచుకునివెళ్లి తనకు రివాల్వర్ గురిపెట్టి తన మీద అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ రెజీనా బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

నగ్న వీడియోలు తీసి చంపేస్తానన్నాడు
తన మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా అమమ్మద్ అతని మొబైల్ లో తన నగ్న వీడియోలు, ఫోటోలు తీశాడని, ఈ విషయం బయటకు తెలిస్తే తనతో పాటు తన కుమార్తెను చంపేస్తానని బెదిరించాడని రెజీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పొలిటికల్ లీడర్ అహమ్మద్, అతని కారు డ్రైవర్ వహీద్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మోడలింగ్ రంగంలో తనకు మంచి గుర్తింపు తీసుకువస్తానని అహమ్మద్ తన జీవితం నాశనం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
Recommended Video

లాక్ డౌన్ టైమ్ లో అంతదూరం ఎలా వెళ్లింది ?
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో అంతదూరం ఆమె ఎలా వచ్చింది? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. అహమ్మద్ కు, రెజీనాకు ముందే ఏమైనా సంబంధం ఉందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తంమీద పిల్లల తల్లిని మోడల్ గా ఓ రైంజ్ కు తీసుకుపోతానని నమ్మించి పొలిటికల్ లీడర్ ఆమె మీద అత్యాచారం చేశాడని కేసు నమోదు కావడం కలకలం రేపింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications